2019.. కేసీఆర్‌కు చివ‌రి ఎన్నిక‌లు!

* కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ నూత‌నోత్సాహం

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్క‌డ్లేని ఉత్సాహం నింపుతున్నారు. అద‌ర‌గొట్టే ప్ర‌సంగాల‌తో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి స‌రికొత్త హుషారు తెస్తున్నారు. ఇక చేవేళ్ల బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగం ప్ర‌జ‌లను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ది. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించాక‌, సీఎం కేసీఆర్ తాండూరు, వికారాబాద్, చేవెళ్ల‌లో పెద్ద‌గా అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌లేద‌ని, ఈ ప్రాంతాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కంటే గ‌తంలోని కాంగ్రెస్ పార్టీయే మేల‌నే ఇక్క‌డి ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఎందుకంటే, ముందునుంచీ ఇక్క‌డున్న‌వారంతా క‌రుడుగట్టిన కాంగ్రెస్‌వాదులే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌హేంద‌ర్ రెడ్డి తెరాస‌లో చేరినా ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద‌గా చేసిందేమీ లేదు. ఇలాంటి అనేక అంశాల్ని గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల నుంచే బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. కాబ‌ట్టి, స‌హ‌జంగానే ఇక్క‌డి ప్ర‌జ‌లు అధికార పార్టీ మీద ఎంతో గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగానికి స్థానిక ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. నాలుగేళ్ల పాల‌న‌లో సొంతంగా ఒక అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభించ‌లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలో ఇర‌వై రెండు ల‌క్ష‌ల మందికి రెండు ప‌డ‌క గ‌దుల ఇండ్లు అవ‌స‌ర‌మ‌ని గుర్తిస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఎనిమిది వేల మందికే ఇచ్చార‌ని విమ‌ర్శించారు. అస‌లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త ప‌ద‌మూడు నెల‌ల్నుంచి స‌చివాల‌యం వైపు రాలేద‌న్నారు. అధికార పార్టీ క‌బ‌డ్డీ ఆడ‌దామంటే మ‌నం క్యారెమ్స్ ఆడ‌దామా? వాళ్లు క‌త్తి యుద్ధం చేస్తామంటే మ‌నం కూచిపూడి డ్యాన్స్ చేస్తామా? మాట‌కు మాట చెప్పాలి. తొడ కొడితే ద‌వ‌డ ప‌గ‌ల‌గొట్టాలి అని రేవంత్ అన‌గానే.. కార్య‌క‌ర్త‌ల్లో స‌రికొత్త ఉత్సాహం నెల‌కొన్న‌ది.

Anupama Inaugurates ABC Clinic
కణం క‌దిలిస్తుందంటున్న ఫిదా పిల్ల‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *