Friday, March 29, 2024
Home Blog

Breaking: వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

మాజీ సీఎం,BRS అధినేత కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ

ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్న కడియం కావ్య.

జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని పేర్కొన్న కావ్య.కెసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి.

తెలంగాణలో రద్దయ్యే జిల్లాలేంటంటే?

తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడున్న 33 జిల్లాలను 17కు తగ్గించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఒక వార్తను ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. రద్దు కానున్న జిల్లాల జాబితాలో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయట.

టిఎన్జీఓ సంఘంలో పదవుల కోసం పాకులాట..!

0

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం 8 మంది పోటీ…
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టిఎన్జీఓ సంస్థలో వివాదాలు ఇంకా సద్దుమణగడం లేదు. ఇన్ని రోజులుగా అధ్యక్షుడి ఎన్నికపై సందిగ్ధత ఏర్పడడం, టిఎన్జీఓ ఎన్నికలకు సంబంధించి కోర్టు కేసులో ఉండడంతో అధ్యక్ష, కార్యదర్శ ఎన్నికలను ఎలా నిర్వహించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి టిఎన్జీఓ నాయకులు తీసుకెళ్లడంతో ఈ సంఘంపై కోర్టులో కేసు వేసిన టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాయికంటి ప్రతాప్‌ను చర్చలకు పిలిపించి ఆయనతో రాజీ చేసి ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించారు. ప్రతాప్ వేసిన కోర్టును వెనక్కి తీసుకున్నందుకు ఆయనకు టిఎన్జీఓలో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పదవి ఇస్తామని టిఎన్జీఓ ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తో పాటు మధ్యవర్తిత్వం వహించిన కొందరు పెద్దలు సైతం రాయికంటి ప్రతాప్ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.

అయితే ప్రతాప్ కోర్టు కేసును వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం టిఎన్జీఓ అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్‌ను వారం క్రితం టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం జరగాల్సిన ప్రధాన కారదర్శి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పట్టించుకోవడం లేదని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు కేసును విరమించుకుంటే తనకు పదవి అప్పగిస్తామని 15 రోజుల క్రితం హామిఇచ్చిన పెద్దలపై టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఒత్తిడి తెస్తుండగా, ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వారి మాటలను పట్టించుకోవడం లేదని ప్రతాప్ ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు ఎదుట తనకు పదవి ఇస్తామని వారు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తేనే తాను కోర్టు కేసును వెనక్కి తీసుకున్నానని అధ్యక్ష పదవి వచ్చాక మారం జగదీశ్వర్ పట్టించుకోక పోవడం బాధాకరమని ప్రతాప్ వాపోతున్నారు. అయితే దీనిపై టిఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ తరువాత రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతాప్‌కు పదవి విషయం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మారం జగదీశ్వర్ పేర్కొనడం విశేషం.

రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్‌ల మధ్య పోటీ
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సుమారు 8 మంది పోటీపడుతుండగా అందులో సీనియర్‌లైన ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షులే రాష్ట్ర ప్రధాన కారద్యర్శి పదవికి పోటీ పడుతుండడం విశేషం. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి ఎంపికయ్యే అవకాశం ఉందని టిఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురిలో ఉద్యోగుల సమస్యల గురించి నిరంతరం శ్రమించే నాయకుడినే తాము ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొంటున్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు దాటినా ఉద్యోగ సంఘాల్లో పెద్దదైన టిఎన్జీఓ సంఘం మాత్రం ఇంకా కార్యవర్గం ఏర్పాటులోనే వివాదాలు కొనితెచ్చుకుంటుండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నాయకులు పదవుల పంపకాల కోసం పాకులాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

భుజంగరావు, తిరుపతన్నకు ఐదు రోజుల కస్టడీ

0

టీఎస్​, న్యూస్​:ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు గురువారం రాత్రి కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది.

టిఎన్జీఓ సంఘంలో పదవుల కోసం పాకులాట..!

0
  • టిఎన్జీఓ సంఘంలో పదవుల కోసం పాకులాట..!
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం 8 మంది పోటీ…

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టిఎన్జీఓ సంస్థలో వివాదాలు ఇంకా సద్దుమణగడం లేదు. ఇన్ని రోజులుగా అధ్యక్షుడి ఎన్నికపై సందిగ్ధత ఏర్పడడం, టిఎన్జీఓ ఎన్నికలకు సంబంధించి కోర్టు కేసులో ఉండడంతో అధ్యక్ష, కార్యదర్శ ఎన్నికలను ఎలా నిర్వహించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి టిఎన్జీఓ నాయకులు తీసుకెళ్లడంతో ఈ సంఘంపై కోర్టులో కేసు వేసిన టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాయికంటి ప్రతాప్‌ను చర్చలకు పిలిపించి ఆయనతో రాజీ చేసి ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించారు. ప్రతాప్ వేసిన కోర్టును వెనక్కి తీసుకున్నందుకు ఆయనకు టిఎన్జీఓలో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పదవి ఇస్తామని టిఎన్జీఓ ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తో పాటు మధ్యవర్తిత్వం వహించిన కొందరు పెద్దలు సైతం రాయికంటి ప్రతాప్ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ప్రతాప్ కోర్టు కేసును వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం టిఎన్జీఓ అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్‌ను వారం క్రితం టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం జరగాల్సిన ప్రధాన కారదర్శి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పట్టించుకోవడం లేదని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు కేసును విరమించుకుంటే తనకు పదవి అప్పగిస్తామని 15 రోజుల క్రితం హామిఇచ్చిన పెద్దలపై టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఒత్తిడి తెస్తుండగా, ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వారి మాటలను పట్టించుకోవడం లేదని ప్రతాప్ ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు ఎదుట తనకు పదవి ఇస్తామని వారు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తేనే తాను కోర్టు కేసును వెనక్కి తీసుకున్నానని అధ్యక్ష పదవి వచ్చాక మారం జగదీశ్వర్ పట్టించుకోక పోవడం బాధాకరమని ప్రతాప్ వాపోతున్నారు. అయితే దీనిపై టిఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ తరువాత రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతాప్‌కు పదవి విషయం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మారం జగదీశ్వర్ పేర్కొనడం విశేషం.

రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్‌ల మధ్య పోటీ

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సుమారు 8 మంది పోటీపడుతుండగా అందులో సీనియర్‌లైన ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షులే రాష్ట్ర ప్రధాన కారద్యర్శి పదవికి పోటీ పడుతుండడం విశేషం. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి ఎంపికయ్యే అవకాశం ఉందని టిఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురిలో ఉద్యోగుల సమస్యల గురించి నిరంతరం శ్రమించే నాయకుడినే తాము ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు దాటినా ఉద్యోగ సంఘాల్లో పెద్దదైన టిఎన్జీఓ సంఘం మాత్రం ఇంకా కార్యవర్గం ఏర్పాటులోనే వివాదాలు కొనితెచ్చుకుంటుండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నాయకులు పదవుల పంపకాల కోసం పాకులాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

0
  • ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచారం
  • ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
  • భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు

టిఎస్‌న్యూస్‌ః కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆగస్టులో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసింది. 48 గంటల వ్యవధిలో అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

గతంలోనూ చిరుతల సంచారం..
తిరుమల నడక మార్గంలో ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. తిరుమలలో ఇటీవల కాలంలో తరచూ చిరుతలు యాత్రికులను భయపెడుతున్నాయి. గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం, ఆతర్వాత మరో చిన్నారిని చంపేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికి నాలుగైదు చిరుతల్ని కూడా పట్టి వేశారు. దారిపొడవునా బోన్లను కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది.

మరోసారి కలకలం..
తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మెట్ల మార్గంలో…
మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. టీటీడీకి సమాచారం ఇచ్చారు.

ఫోన్​ ట్యాపింగ్…​ సమంత సంసారంలో చిచ్చు

0

టీఎస్​, న్యూస్​ : సినీ పరిశ్రమలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. పలువురు సినీ హీరో, హీరోయిన్ల ఫోన్ కాల్స్‌ను గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయం బయటకు రాగానే ప్రస్తుతం సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్త అందర్నీ ఎక్కువగా ఆకర్షించింది. అయితే ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ హీరో ఎవరా? అనే ఆసక్తి అందరిలోను పెరిగింది. అయితే తన భర్తకు విడాకులు ఇవ్వడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఓ కారణం అనే విషయం ఈ వివాదంలో అటెన్షన్ క్రియేట్ చేసింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ అంశం మరింత క్యూరియాసిటిని క్రియేట్ చేసింది. టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు, తారలకు వేధింపులు వచ్చాయని తెలుస్తున్నది. ఇలాంటి సమయంలోనే యూట్యూబర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే కారణమని ఓ వార్త రాష్ట్రంలో వైరల్​ అవుతున్నది. ఆ ఇద్దరు సెలబ్రిటీల మధ్య అప్పటి అధికార పార్టీలోని కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే విడాకులు తీసుకొన్నారని తెలుస్తున్నది.

వర్కౌట్​ కాకపోవడంతో..?
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటో తెలియ రాలేదు. ఎవరికి వారు తమకి నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వివరిస్తూ వచ్చారు. కాగా సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్ డోస్‌ పెంచడమే వీళ్ళు విడాకులకు కారణం అంటూ వార్తలు వినిపించాయి.

సమంత వ్యవహరించే తీరు అతని ఫ్యామిలీకి నచ్చలేదని.. పిల్లల విషయంలో చైతు, సమంత మధ్యలో గొడవలు జరిగాయని, అక్కినేని వ్యాపారాల్లో ఈమె జోక్యం చేసుకోవడం కూడా ఆ ఫ్యామిలీకి నచ్చలేదంటూ.. వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అసలు విషయం ఏంటనేది ఆ జంట‌కే తెలియాలి. అయితే ఇప్పుడు శ్యామ్ చైతు విడిపోవడానికి కారణం అదే అంటూ మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, జ‌డ్జీల‌ ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేస్తున్నారు. ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని.. వారి అండదండలతోనే పోలీసులు.. అధికారులు.. ఫోన్ టాపింగ్స్ చేశారనే.. విషయం డిఎస్పీ విచారణలో వెళ్లడయింది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ లో ప్రముఖ హీరో, హీరోయిన్ విడిపోయారు. మూడు తరాల సినిమాల్లో రాణిస్తున్న ఫ్యామిలీకి చెందిన హీరో, స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి ఈ ఫోన్ టాపింగ్ కారణంగానే విడాకులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆరోపణలు వైరల్ గా మారాయి.

తీన్మార్ మల్లన్న మాత్రం ఆ ఇద్దరు నాగచైతన్య, సమంతనే అని తెలుసేట్లుగా చెప్పారు. ఈ విషయంపై పూర్తిగా సమాచారం సేకరించి వీడియో చేస్తానని యూట్యూబ్ వీడియోలో వెల్లడించాడు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. నటి ఫోన్ ట్యాప్ చేశారని.. ఆమెతో భేరసారాలు చేసి అది వర్కౌట్ కాకపోవడంతో.. హీరో ఫ్యామిలీకి ఆ వీడియో ఇచ్చేసారని ఆయన చెప్పుకొచ్చాడు. సమంత, చైతు విడిపోవడానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్.. మందుల వ్యాపారం చేసే పొలిటిషన్ హ‌స్తం ఉందంటూ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘టిల్లు స్క్వేర్’ ఉంటుంది

0

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ‘టిల్లు స్క్వేర్’ అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ అట్లూరి, నీరజ కోన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఐదుగురు దర్శకులు కలిసి ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ రిలీజ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది.

కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “డీజే టిల్లు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ పాట కోసం రామ్ మిరియాల గారిని ఆఫీస్ కి పిలిపించాము. పారితోషికం గురించి మాట్లాడుతుంటే.. అప్పుడు ఆయన డబ్బులు గురించి తర్వాత చూద్దాం.. ముందు పాట బాగా రావాలి అన్నారు. సినీ పరిశ్రమలో ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. రామ్ మిరియాలను కలిసిన ప్రతిసారీ ఒక మాట అంటాను. అదేంటంటే.. నువ్వు పాడినప్పుడు నీ గొంతులో మట్టివాసన ఉంటుంది. అంత రియల్ గా, అంతా రా గా ఉంటుంది. డీజే టిల్లు పాటని అంత అద్భుతంగా స్వరపరిచిన రామ్ మిరియాల గారికి, అంతే అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు. సినిమాని ఆ పాటే భుజాల మీద తీసుకెళ్లి సగం మోసింది. నాకు ఇలాంటి పాట అందించిన మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. అలాగే ఈ సినిమాలో భాగమైన శ్రీరామ్ చంద్ర గారి వాయిస్ చాలా బాగుంటుంది. బేబీ సినిమాలో ఆయన వాయిస్ విని పిచ్చొడిని అయిపోయాను. మనసు విరిగిన కుర్రాళ్ళ మనస్సులో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంటుంది. శ్రీరామ్ గారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మా మార్కస్, లడ్డు గురించి చెప్పాలి. ఈ జర్నీలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నా తల్లిదండ్రుల పాత్రలు పోషించిన మురళీధర్ గారు, సుజాత గారు, మిగతా నటీనటులకు థాంక్స్. డీజే టిల్లు అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. బయట ఎక్కడైనా కనిపిస్తే టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము. అయినా మొదట కాస్త భయపడ్డాము. యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. మార్చి 29న థియేటర్లకు రండి, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈ సినిమా విషయంలో నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. ముందుగా మ్యాడ్ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నేను, కళ్యాణ్, ఆంథోనీ, మల్లిక్ కలిసి ఈ సినిమా రాశాము. కళ్యాణ్ మాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారికి, డీటీఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాకు అండగా నిలిచిన చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే.. త్రివిక్రమ్ గారికి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. భీమ్స్ సిసిరోలియో గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టిల్లు లో మాస్ ని తన సంగీతంతో ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. మార్చి 29న థియేటర్లలో చాలా చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి. మాస్ క్లైమాక్స్ ని చూడబోతున్నారు. టిల్లు స్క్వేర్ మీ అంచులను ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తాజాగా నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు.. కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా ‘డీజే టిల్లు’ పాటలను, మాటలను మీ జీవితంలో ఒక భాగం చేశారు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మార్చి 29న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. సిద్ధుతో ఈ రెండేళ్ల ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. ‘డీజే టిల్లు’ మిమ్మల్ని ఎంతలా అలరించిందో.. ‘టిల్లు స్క్వేర్’ మిమ్మల్ని అంతకుమించి అలరిస్తుంది.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన వెంటనే నేను సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. 12-13 ఏళ్ళ క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి సిద్ధు నాకు పరిచయం. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో నాకు తెలుసు. ఈ అభిమానానికి, స్టార్ బాయ్ ట్యాగ్ కి నువ్వు అర్హుడివి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు పెద్ద హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టేవి. ఈ తరంలో సిద్ధు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని జానర్ సినిమాలు చేస్తూ సిద్ధు మరింత ఎదగాలి అని కోరుకుంటున్నాను. నాకు ట్రైలర్ లో “నేను పెంచలే.. వాడే పెరిగిండు” అనే డైలాగ్ బాగా నచ్చింది. దర్శకుడు మల్లిక్ రామ్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, రామ్ మిరియాల గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. సిద్ధుతో నాకో స్పెషల్ మూమెంట్ ఉంది. 2015లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో ఒక సాంగ్ ట్యూన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తే సిద్ధు ది ఒక చిన్న ఫొటో చూశాను. ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు అని మా కో డైరెక్టర్ కి చెప్పి.. ఆఫీస్ కి పిలిపించాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఏదైనా మంచి పాత్ర ఉంటుంది అనుకొని సిద్ధు వచ్చాడు. కానీ సిద్ధుని చూడగానే “భవిష్యత్ లో ఇతను ఎక్కడికో వెళ్తాడు” అని అనిపించింది. అప్పుడు సిద్ధుతో.. “ఈ సినిమాలో వేషం ఇవ్వడం కోసం నిన్ను పిలవలేదు, నువ్వు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతావు” అని చెప్పాను. ‘డీజే టిల్లు’ తర్వాత ఒక వేడుకలో కలిస్తే.. సిద్ధునే ఈ విషయాన్ని నాకు గుర్తు చేశాడు. అందరూ అంటున్నట్టు సిద్ధు ఎనర్జీ మైండ్ బ్లోయింగ్. పిల్లల్లో కూడా సిద్ధుకి అభిమానులు ఉన్నారు. సీక్వెల్ ట్రైలర్ చూస్తే.. ‘డీజే టిల్లు’ కంటే డబుల్ ఎనర్జీ ఉంది. నిర్మాత నాగవంశీ గారు కూడా మా బాలయ్య బాబు గారి ‘NBK 109’ షూటింగ్ సమయంలో ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పారు. దర్శకుడు రామ్ మల్లికి గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. “ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంది. సినిమా ఇంతకంటే పది రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ లో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు సిద్ధు ఎనర్జీ అదిరిపోయింది. సినిమా కూడా అలాగే ఉంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “రిలీజ్ ట్రైలర్ చూశాక కడుపు నిండింది. ‘డీజే టిల్లు’ ఎంత వసూలు చేసిందో.. దానికి కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ‘టిల్లు స్క్వేర్’ వసూలు చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు నీరజ కోన మాట్లాడుతూ.. “ట్రైలర్ అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికే కొంత భాగం సినిమా కూడా చూశాను. ఆద్యంతం వినోదభరితంగా చాలా బాగుంది. దర్శకుడు మల్లిక్ రామ్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, సిద్ధుకి అందరికీ ముందుగానే కంగ్రాట్స్. సక్సెస్ పార్టీకి రెడీగా ఉండండి.” అన్నారు.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. నటీనటులు మురళీధర్, ఆంథోనీ, సుజాత, సంగీత దర్శకులు రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శివమల్లాల నిర్మాతగా నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా

0

టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ శివమల్లాల ఈ బ్యానర్‌ నిర్మాత. ఈ సినిమా శివమ్‌ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్‌ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది’’ అన్నారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– ‘‘ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్‌ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్‌ సినిమానా, స్ట్రెయిట్‌ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ.

“సముద్రుడు” ట్రైలర్ విడుదల

0

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సముద్రుడు”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ నేపథ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ “మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది..సముద్రమే వారి జీవనాధారం.. అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం అన్నారు..మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ రోజు మా చిత్ర ట్రైలర్ ను, పాటలను పాత్రికేయుల సమక్షంలో ప్రదర్శించడం ఆనందంగా ఉందని, త్వరలోనే సినిమా రిలీజ్ కూడా చేస్తామన్నారు..
హీరో రమాకాంత్ మాట్లాడుతూ “మా సముద్రుడు చిత్ర ట్రైలర్ మరియు పాటలను మీడియా మిత్రులకు చూపించడం చాలా సంతోషం గా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని విశ్వాసం తో చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశామన్నారు..ఈ సందర్భంగా రమాకాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు..తప్పక విజయాన్ని అందుకుంటామని నమ్మకం వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరక్టర్ వీర శంకర్, సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ముత్యాల రామదాసు, షేకింగ్ శేషు వంటి వారు విచ్చేసి టీమ్ మొత్తానికి వారి శుభాకాంక్షలు అందజేశారు.