ప‌డుకోకుండా ఏ ప‌నీ కాదు…. హీరోయిన్ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘‘తెలుగులో ఏడాది వంద సినిమాలు విడుద‌ల‌వుతుంటే, అందులో ఏ రెండో మూడో మాత్ర‌మే హిట్ట‌వుతున్నాయి. ఏ ఎందుకు? ఎందుకంటే వాటిల్లో తెలుగు నెటివిటీ ఉండ‌దు. ఇక్క‌డ తెలుగు హీరోయిన్ల‌కి ఛాన్స్ ఇవ్వ‌రు. ఏ… తెలుగు వాళ్లు హాట్‌గా ఉండ‌రా?  లేక పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేయ్యారా? ఇవేమీ కావు. ఎందుకంటే తెలుగ‌మ్మాయిలు ప‌డుకోరు. ప‌డుకోనిదే… ఇక్క‌డే ప‌ని జ‌ర‌గ‌దు… హీరో నాని అయినా లేక నాన్న‌ల పేర్లు త‌గిలించుకున్న ఏ హీరో అయినా ముంబై అమ్మాయిలే కావాలి…’’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది న‌టి శ్రీ‌రెడ్డి. ‘అర‌వింద్ 2’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్ న‌డుస్తుండ‌డం విశేషం.
ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్య్వూలో పాల్గొన్న ఆమె, తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కోచ్ సంస్కృతి గురించి మాట్లాడింది. ప్ర‌తీ ఇండ‌స్ట్రీలో ఈ స‌మ‌స్య ఉంద‌ని చెప్పిన ఆమె, త‌మిళ ఇండ‌స్ట్రీలో అయితే డెడికేష‌న్ చూపిస్తారా? అని అడుగుతార‌ని, అదే తెలుగులో అయితే క‌మిట్‌మెంట్ ఇస్తారా? అని అడుగుతార‌ని చెప్పింది. ఆ మాట‌లకి అర్థం ప‌డుకోడానికి సిద్ధ‌మేనా? అని అర్థం చేసుకోవాల‌ని చెప్పింది. ‘‘సినిమా క‌థ చెప్ప‌క‌ముందే, మీరు క‌మిట్‌మెంట్ చూపిస్తారా? అని అడుగుతారు. అంటే పడుకోడానికి సిద్ధ‌మేనా… అని ఇన్‌డైరెక్టుగా ఎంక్వైరీ చేస్తారు. పోనీలే… అని అవ‌కాశం కోసం అన్ని చంపుకుని ఒప్పుకుంటే చివ‌రికి తెలుగు అమ్మాయిల‌కి ద‌క్కేది చిన్న చిన్న సైడ్ క్యారెక్ట‌ర్లు. ప‌డుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదంటే అవ‌కాశ‌మే ఉండ‌దు. నాని ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తీ స్టార్ హీరోకి ముంబై హీరోయిన్లే కావాలి. లేదా క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళీ అమ్మాయిలు కావాలి.
 ఏం తెలుగ‌మ్మాయిలు ఏ త‌ప్పు చేశారు. మేం స‌రిగ్గా ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేయ‌ట్లేదా? ఎక్స్‌పోజ్ చేయ‌ట్లేదా?  మేం హాట్‌గా లేమా? అయినా ఎందుకు తెలుగు అమ్మాయిల‌కు ఛాన్స్ రాద‌న్న‌ది ప్ర‌శ్న‌. తెలుగమ్మాయిలు కాంప్ర‌మైజ్ కారు. అంటే ప‌డుకోరు. పడుకుంటే చిన్న క్యారెక్ట‌ర్ ఇస్తారు. లేదంటే ప‌న‌వ్వ‌దు. నేనొక సినీ రిపోర్ట‌ర్‌గా, న్యూస్ రీడ‌ర్‌గా కూడా ప‌నిచేశాను. కాబట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నారు. మొన్న అర్చ‌న చెప్పింది, అంతకు ముందు రాధిక ఆప్టే చెప్పింది. ఈ మ‌ధ్య‌నే శ్రియ కూడా దీని గురించి మాట్లాడింది…  ఎన్ని ప‌క్క‌ల కింద న‌లిగితే సినిమాలొస్తాయో నాకు తెలుసు. ఆఫ‌ర్ల కోసం నా శ‌రీరాన్ని దాచుకోకుండా ఎక్స్‌పోజ్ చేస్తున్నా. సిగ్గు కూడా వ‌దిలేసి. తిండి తిప్ప‌లు వ‌దిలేసి, వ‌ర్క‌వుట్లు చేసి బాడీని అందంగా మెయింటేన్ చేసేది అవ‌కాశాల కోస‌మే. నిద్ర కూడా వ‌దిలేసి, అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ ఉండాలి. ఇక్క‌డ కాస్ట్ ఆఫ్ లివింగ్ స‌మ‌స్య‌. సాధార‌ణ దుస్తుల్లో క‌నిపిస్తే ప‌ట్టించుకోరు. చెప్పాలంటే ఏడుపొచ్చేస్తుంది… పైకి నీతులు చెప్పే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు కూడా ఎంత మంది తెలుగు అమ్మాయిల‌కి ఛాన్సులు ఇచ్చారు. ఎక్క‌డి నుంచో ప్ర‌ణీత లాంటి వాళ్ల‌ని తీసుకొచ్చి, మీరు ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డ తెలుగు అమ్మాయిలు కూడా బాగా మెయింటెయిన్ చేస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాన్ గారు ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ గురించి పోరాడుతున్నారు క‌దా! నేను తెలుగు అమ్మాయిలకు అవ‌కాశాల కోసం పోరాడుతా… చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అంద‌రికీ స‌మంతా, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, కాజ‌ల్ లాంటి వేరు భాష‌ల వాళ్లే కావాలి. లిప్ సింక్ కాక‌పోయినా ప‌ర్వాలేదు. కానీ తెలుగు అమ్మాయిల‌ని ఎందుకు ప‌ట్టించుకోరు…’’ అంటూ తీవ్రంగా మాట్లాడింది శ్రీ‌రెడ్డి. ఆమె వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో పెను సంచల‌నం సృష్టిస్తున్నాయి.
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న స‌మంత డూప్‌!
పట్టణాల పురోగతికి మరిన్ని నిధులు- మంత్రి కెటి రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *