ట్రంప్ ప‌న్నులేస్తే… మ‌న‌కేంటి..?

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వారి దేశంలో దిగుమ‌తి సుంకాలు పెంచుకుంటే, కొత్త‌గా వేసుకుంటే మ‌న దేశానికి వ‌చ్చిన న‌ష్టం ఏంటి..? ఆర్థిక వేత్త‌లు అంటున్న‌ట్లు ప్ర‌పంచ వాణిజ్య యుద్ధం ఎలా అవుతుంది..? ట‌్రంప్ ఒక్క దేశం లేక‌పోతే ప్ర‌పంచంలో మిగ‌తా దేశాలు లేవా.. భావ‌సారూప్య దేశాల‌తో మ‌నం ఒప్పందాలు చేసుకోలేమా?  ఈ విష‌యాల‌పై క‌నీసం ఒక అవ‌గాహ‌న‌కు రావాలంటే మ‌నం ఒక ఉద‌హార‌ణ చూడాలి..
* మ‌న దేశంలో రైతు పంట పండించాలంటే  ఓ త‌ల్లి ప్ర‌స‌వం అయ్యేట‌ప్పుడు ఎంత క‌ష్ట‌పడాలో రైతు కూడా పంట ఉత్ప‌త్తిని తీయాలంటే అంతే క‌ష్ట‌ప‌డుతుంటాడు. ఇవి కాక‌ప్ర‌కృతి వైప‌రిత్యాలు, గిట్టుబాట ధ‌ర‌లు, మార్కెట్ మోసాలు, ద‌ళారుల రాజ్యాలు.. దాడి చేసి చేతికొచ్చిన పంట‌ను రైతు నుంచి లాగేస్తాయి.  విత్త‌నాలు నాటే స‌మ‌యం నుంచి ఉత్ప‌త్తి చేతి కొచ్చే వ‌ర‌కు రైతులకు ఎలాంటి భ‌రోసా ఉండ‌దు. పైగా ఉత్ప‌త్తిని, ఇన్నాళ్ల త‌న‌ శ్ర‌మ‌ను ఆదాయంగా మార్చుకుందాం అంటే ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వ‌దు.  అదే అమెరికాలో.. భూమిని న‌మ్ముకున్న రైతులు 100 శాతం కాదు.. 150 శాతం స‌బ్సీడీలు ఇస్తారు. పంట పండక‌పోయినా రాయితీలు ఇస్తారు.  భూమి బీడుగా పెట్టినా అత‌న్ని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు వ‌స్తుంది. ఆధునికీక‌ర‌ణ అయిన అక్క‌డి సాగుకు ప్రైవేటు కంపెనీలు పెద్దెత్తున యంత్ర సామ‌గ్రి స‌మ‌కూరుస్తాయి. రైతు అక్క‌డా హుందాగా ఉంటాడు.  విత్త‌నాలు, పురుగు మందులు, యంత్ర‌సామ‌గ్రి అన్నింటికి ప్ర‌భుత్వం రాయితీలు ఇస్తుంది. వ‌చ్చిన ఉత్ప‌త్తిని రైతులు ధ‌ర నిర్ణ‌యించి అమ్ముకునే స్వేచ్ఛ‌ను ఇస్తుంది.
* మ‌న దేశంలో ఒక రైతు త‌న‌కుమారున్ని ఏ చిన్న జాబైనా స‌రే ఉద్యోగం చేయించాల‌ని కోరుకుంటారు. అదే.. అమెరికాలో పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివిన రైతు బిడ్డ‌లు మ‌ళ్లీ వ‌చ్చి వారి పొలాల్లో సాగు మొద‌లుపెడ‌తారు. అక్కడ సాగును అంత‌గా ఓన్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న‌ రాయితీలు. రైతులు ఇస్తున్న స్వాతంత్య్రం.  మ‌న రైతులు ఇంత క‌ష్ట‌ప‌డే బ‌దులు ప్ర‌భుత్వాలు కూడా రాయితీ ఇస్తే బాగుంటుంది క‌దా..  పెద్ద దేశం సువిశాల సాగుభూమి ఉన్న‌దేశం. యువ శ‌క్తి ఎక్కువ ఉన్న దేశం ఎందుకు ఇవ్వ‌దు.. దీనికంత‌టికీ కార‌ణం కూడా అమెరికానే. మ‌న రైతుల‌కు పూర్తిగా రాయితీలు ఇస్తే .. అమెరికాను మించి పోటాపోటీగా ఉత్ప‌త్తిని తీస్తారు.  అప్పుడు అమెరికాలో పండిన ఉత్ప‌త్తిని మ‌నం దిగుమ‌తి చేసుకోలేం. అమెరికా రైతులు దివాలా తీస్తారు. అందుకే అమెరికా అప్పుల ఎర చూపి, త‌న వ‌ద్ద ఉన్న బాంబుల బూచీ చూపి, ఐరాస‌ వంటి ప్ర‌పంచ సంస్థ‌లు త‌న గుప్పిట్లో పెట్టుకుని మ‌న‌లాంటి, మ‌న‌కంటే పేద దేశాల‌పై ఇలాంటి ఆంక్ష‌లు విధిస్తోంది. మ‌న రైతుల‌కు రాయితీలు ఇవ్వ‌దు. పైగా విదేశీ పురుగుమందుల త‌యారీ  సంస్థ‌లు మ‌న దేశంలో పాదుకొల్పి మ‌న రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకేలా, ఇక్క‌డి సాగు ధ్వంసం అయ్యేలా ఆర్థిక స‌ర‌ళీక‌ర‌ణ‌లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి అమెరికా ప్ర‌య‌త్నిస్తోంది. అది స‌ఫ‌లీకృత‌మై మ‌న సాగు దెబ్బ‌తింటోంది.
* ఇప్పుడు ట్రంప్ వారి దేశంలో ప‌న్నులు వేస్తే మ‌న వ‌ద్ద నుంచి అమెరికాకు వెళ్లే కొద్ది పాటి వ‌స్తువుల ఉత్ప‌త్తి దారులు కూడా ఆ ప‌న్నులు త‌ట్టుకోలేరు. అమెరికాలో దొరికే జామ‌కాయ మ‌న రైతులు పండించే జామ‌కాయ కంటే మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతోంది. అంటే అక్క‌డి ప్ర‌భుత్వం స్థానిక ఉత్ప‌త్తుల‌కు ప్రోత్సాహం ఇస్తోంది. అదే మ‌నం ఎలాంటి రాయితీలు లేకుండా పండించి మ‌ళ్లీ అమెరికాతో పోటీ త‌ట్టుకోలేక‌, ఇక్క‌డ అమ్ముకోలేక ఇత‌ర ఏ దేశానికి అమ్ముకోవాల‌న్నా అమెరికా పెట్టిన ప‌న్నుల పెంట వ‌ల్ల ఆదేశంలోనూ ప‌న్నులు పెంచేస్తారు. దీంతో పేద దేశాలు వారి ఉత్ప‌త్తుల‌ను ఇత‌ర దేశాల‌కు ఎదుగ‌మ‌తి చేసుకోకుండా అవుతాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాబిన్నం అవుతుంది. ఇదే వాణ‌జ్య యుద్ధం. ఒక దేశం ఆర్థికంగా  దెబ్బ‌తింటే చాలు క‌దా.. దాన్నిప‌ని అయిపోవ‌డానికి.!
యాంటీబయోటిక్స్‌తో కేన్సర్‌ చికిత్సకు ముప్పు
స్వామిగౌడ్‌పై దాడి నేత‌ల బుకాయింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *