ప్ర‌త్యేక పోరు : హోదా కోసం గ‌ళ‌మెత్తిన జేఏసీ

– భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగ‌, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు
– ర్యాలీకి విశేష స్పంద‌న.. త్వ‌ర‌లో ఉద్య‌మం మ‌రింత తీవ్ర‌త‌రం
– విభ‌జ‌న హామీల‌న్నీ అమ‌లు చేయాలి :  చౌద‌రి పురుషోత్తం నాయుడు 
– కేంద్రం మాట ఇచ్చి త‌ప్పింది.. ఇది త‌గ‌దు : హ‌నుమంతు సాయిరాం 
శ్రీ‌కాకుళం : ఓ పోరు మ‌ళ్లీ ప్రారంభ‌మైంది.అవశేషాంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా ద‌క్కిస్తేనే అభివృద్ధి సాధ్యం అంటూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ‌ర్గాల జేఏసీ గొంతెత్తింది. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర స‌హాధ్యక్షులు చౌద‌రి పురుషోత్తం నాయుడు, జేఏసీ చైర్మ‌న్ హ‌నుమంతు సాయిరాం క‌దం తొక్కింది. హోదా ద‌క్కించే విష‌య‌మై కేంద్రం ఇచ్చిన మాట త‌ప్పి గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు దారితీసేలా వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని, ఇది త‌గ‌ద‌ని తెలిపింది. నాటి విభ‌జ‌న స‌మ‌యంలో చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌న్నింటినీ అమలు చేయాల‌ని, లేదంటే రాష్ట్ర భ‌విష్య‌త్ అధోగ‌తి పాలవ్వ‌క త‌ప్ప‌ద‌ని ఆవేద‌న చెందింది. జేఏసీ నేతృత్వాన శ్రీ‌కాకుళం జిల్లాకేంద్రంలో జ‌రిగిన ర్యాలీకి విశేష స్పంద‌న వ‌చ్చింది. తొలుత ఈ ర్యాలీ ఏపీ ఎన్జీఓ హోం ద‌గ్గ‌ర ప్రారంభ‌మై ఏడు రోడ్ల కూడ‌లికి చేరుకుని, అనంత‌రం జీటీ రోడ్డు మీదుగా సాగి తిరిగి పొట్టి శ్రీ‌రాముల జంక్ష‌న్ వ‌ద్ద ముగిసింది.ఆ వివ‌రాలివిగో..
విన్న‌పం ఇది విన‌వ‌లె : ఆ..ఏడు డిమాండ్లూ తీర్చాల్సిందే..
ఓ కొత్త ఉద్య‌మానికి నాంది ఇది.. మలి సంధ్య వేళ‌ల్లో ఆరంభం అయిన వికాసం ఇది.. ఇది విస్తృతికి నోచుకోవాల‌ని కోరుకుందాం.ఈ సంద‌ర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర స‌హాధ్య‌క్షులు చౌద‌రి పురుషోత్తం నాయుడు, జేఏసీ చైర్మ‌న్ హ‌నుమంతు సాయిరాం మాట్లాడుతూ.. “ఇప్ప‌టికే రాష్ట్రం 16వేల కోట్ల రూపాయల లోటు బ‌డ్జెట్‌లో ఉంది. కేంద్రం ఇస్తామ‌న్న హోదా ఇవ్వాల్సిందే. అప్పుడే లోటు బ‌డ్జెట్ భ‌ర్తీతో పాటు అద‌న‌పు నిధుల విడుద‌ల కూడా సాధ్యం అవుతుంది. ఇప్ప‌టికే వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌లేదు. అలాంట‌ప్పుడు శ్రీ‌కాకుళం లాంటి జిల్లాల‌కు పురోగ‌తి ఎలా సాధ్యం అన్న‌ది మా సూటి ప్ర‌శ్న‌. నాడు పార్ల‌మెంట్ వేదిక‌గా ఇచ్చిన హామీని నిలుపుకోవాలి.ప్రత్యేక హోదాని ఇవ్వాలి. మొద‌ట ఇచ్చిన మాట ప్ర‌కారం ఐదు కాదు ప‌దేళ్లు అన్నారు త‌రువాత 15 ఏళ్లు అన్నారు.. ఇలా ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ రాష్ట్రానికి హోదా ద‌క్కించే తీరుతామ‌నే చెప్పింది. ఇప్పుడా మాట‌ను నిల‌బెట్టుకుని రాష్ట్ర ప్ర‌గ‌తికి చేయూత ఇవ్వాలి. ముందుగా ఈ విష‌యమై నెల‌కొన్న అస్ప‌ష్ట‌త తొల‌గించాలి. పోల‌వ‌రానికి నిధుల కేటాయింపులోనూ ఇంకా వివ‌క్షే సాగుతోంది. ఇది త‌గ‌దు. పోల‌వ‌రం స‌వ‌ర‌ణ అంచ‌నాల‌పై కేంద్రం అనేకానేక ప్ర‌శ్న‌లు సంధిస్తుందే కాని ఎంత మేర‌కు ఈ ప‌థ‌కానికి నిధులు కేటాయిస్తామ‌న్న‌ది చెప్ప‌డం లేదు. నిన్న‌మొన్న‌టి బ‌డ్జెట్‌లోనూ చెప్పుకోద‌గ్గ రీతిలో నిధులు కేటాయించ‌లేదు. దీనిపైనా కేంద్రం పున‌రాలోచించుకోవాలి. అదేవిధంగా 9,10 షెడ్యూళ్ల ప్ర‌కారం ఉమ్మ‌డి ఆస్తుల పంప‌కం వెంట‌నే చేప‌ట్టాలి. బ‌డ్జెట్ లోటుని పూరించాలి. విభ‌జ‌న హామీలు వీలున్నంత త్వ‌ర‌గా నెర‌వేర్చి ఆంధ్రుల‌కు అండ‌గా నిల‌వాలి. అదేవిధంగా రాజ‌ధాని నిర్మాణానికి త‌గిన‌న్ని నిధులు ఇవ్వాలి.. ఈ ఏడు డిమాండ్ల సాధ‌నే ధ్యేయంగా మున్ముందుకు సాగుతాం. ఇప్ప‌టికైనా ఏపీని అన్నివిధాలా
కేంద్రం ఆదుకోవాల‌న్న‌దే మా విన్న‌పం” అని అన్నారు. కార్య‌క్ర‌మంలో ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా కార్య‌ద‌ర్శి చ‌ల్లా శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఎల్ జ‌గ‌న్మోహ‌న‌రావు, ఆర్ వేణుగోపాల్, ఏపీ ఎన్జీఓ సంఘ ప్ర‌తినిధులు నానాజీ, ఏజెఎం రాధాకృష్ణ‌, జి.కృష్ణ‌, పూజారి జాన‌కీరాం, కాయ‌ల కృష్ణ‌, డి.పార్వ‌తి, పైడి శ్రావ‌ణి, ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక సంఘాల ప్ర‌తినిధులు పూర్ణ చంద్ర‌రావు, బొడ్డేప‌ల్లి మోహ‌నరావు, గొంటి గిరిధ‌ర్‌, చౌద‌రి ర‌వీంద్ర‌, పప్ప‌ల రాజ‌శేఖ‌ర్‌, స‌న్న‌శెట్టి రాజ‌శేఖ‌ర్‌, కొప్ప‌ల భానుమూర్తి, ముఖ‌లింగం, అప్పారావు, భైరి అప్పారావు, గురుగుబెల్లి దామోద‌ర్‌, బీసీ సంఘాల ప్ర‌తినిధి చంద్ర‌ప‌తి త‌దిత‌రు
చారిత్రాత్మక నిర్ణయం...జగన్ రాజీనామా
మార్చి 23న గులేబకావళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *