మధుమేహ పరీక్ష ఇంకో కొత్త పద్ధతిలో…

ఇప్పటీ ఆధునిక ప్రపంచంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య డయాబెటీస్. మధుమేహంతో బాధపడుతున్న బారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఇప్పుడా డయాబెటీస్ ను పరీక్ష చేసుకోవటానికి కొత్త పద్ధతిని కనుగొన్నారు శాస్త్రజ్ఞులు… అదేనండీ కాంటాక్ట్ లెన్స్… మన కన్నీళ్లతోనే షుగర్ ఎంతుందో తెలుసుకోవచ్చట.. మధుమేహ రోగులు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను పర్యవేక్షిస్తూ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేసుకోవాలి.
ఆ బాధ లేకుండా కేవలం కన్నీళ్లతోనే చక్కెర స్థాయులను పర్యవేక్షించే కాంటాక్ట్‌ లెన్స్‌ను దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. గ్లూకోజ్‌ సెన్సర్‌, చిన్న ఎల్‌ఈడీ బల్పును కలిగి ఉండే ఈ లెన్స్‌ను కళ్లకు పెట్టుకున్నపుడు కన్నీరు తాకి దానిలో ఉండే చక్కెర స్థాయులను గ్లూకోజ్‌ సెన్సర్‌ గుర్తిస్తుంది. పరిమితికి మించి చక్కెర ఉంటే ఎల్‌ఈడీ బల్బు ఆగిపోతుంది. ఇప్పటికే ఎలుకలపై ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తికాగా మనుషులపై ప్రయోగించాల్సి ఉంది.
.

11 అంశాల‌తో కేంద్రానికి త‌లంటుపోసిన జేఎఫ్‌సీ
దేశాన్ని ఏలుతాడ‌ని కేసీఆర్ జాత‌కంలో ఉందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *