యాపిల్ నుంచి స‌రికొత్త ఫోన్లు

ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ యాపిల్ నుంచి వ‌చ్చే ఫోన్ల గురించి ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఇలా రాగానే వేల కొద్దీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. అది అమెరికా కంపెనీ అయినా… ఇండియాల్లాంటి ఇత‌ర‌దేశాల్లోనే ఆ ఫోన్ల‌కు ఫ్యాన్స్ ఎక్కువే. ఐఫోన్ వాడ‌డం అనేది చాలా మంది యువ‌త క‌ల కూడా. అందుకే ఈఎమ్ఐలు క‌ట్టుకుని మ‌రీ కొనేసుకుంటున్నారు. గతేడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ఐఫోన్ 7 సిరీస్ అప్పుడే పాతదై పోయింది. ఇప్పుడు ఐఫోన్ సిరీస్లో కొత్త మోడళ్ల‌ను తీసుకొస్తోంది యాపిల్‌. ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మూడు ఫోన్ల‌ను ఆవిష్క‌రించింది. ఐ ఫోన్ 10, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్ పేరుతో వీటిని విడుద‌ల చేశారు. వీటిలో ఐఫోన్ 8, 8ప్ల‌స్ ఖ‌రీదు 64,000 నుంచి మొద‌ల‌వుతుంది. ఇక ఐఫోన్ 10 ఖ‌రీదు 89,000 రూపాయ‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ఫోన్లు మార్కెట్లో ల‌భించ‌డానికి ఇంకా కొన్ని రోజులు ఆగాలి. సెప్టెంబ‌ర్ చివ‌రిలో ఇవి అందుబాటులోకి వ‌స్తాయి. మ‌న దేశంలో కూడా సెప్టెంబ‌ర్ 29 నుంచి మార్కెట్లో ల‌భించే అవ‌కాశం ఉంది. ఐఫోన్ 10 మార్కెట్లోకి రావ‌డానికి న‌వంబ‌ర్ వ‌ర‌కు వేచి యుండాలి.
కాగా ఐఫోన్ 8లో  ఒక ప్ర‌త్యేక ఫీచ‌ర్ ఉన్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ ప‌త్రిక దీని గురించి గ‌తంలో క‌థ‌నం రాసింది. ఆ స్పెష‌ల్ ఫీచ‌ర్ పేరు ఫేస్ అన్ లాక్ ఫీచర్.  దాని ప్ర‌కారం కస్టమర్లు తమ కెమెరావైపు చూస్తే చాలు ఫోన్ అన్ లాక్ అవుతుందని అంటున్నారు.  బయోమెట్రిక్ కిట్ విధానంతో ఇది పని చేస్తుందని స‌మాచారం. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే ఫోన్లు మార్కెట్లోకి రావాలి.
మాజీ సీఎం కేంద్రమంత్రి!
అర్జున్ రెడ్డి హీరోయిన్ కు అస్వస్థత...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *