jai simha telugu review

రివ్యూ: రొటీన్ మాస్ మసాలా ‘జైసింహా’
రేటింగ్: 2.5
సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా వుందంటే హిట్టనే నమ్మకం అటు నిర్మాతల్లోనూ.. ఇటు బాలయ్య అభిమానుల్లోనూ వుంది. అందుకే సంక్రాంతికి కచ్చితంగా బాలయ్య సినిమా ఒకటి షెడ్యూల్ అవుతూనే వుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా. ఇందులో కొన్ని బ్లక్ బస్టర్ అయ్యాయి.. మరికొన్ని ఫ్లాపులూ మూటగట్టుకున్నాయి. గతేడాది వచ్చిన బాలయ్య వందో సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి ‘జైసింహా’తో మన ముందుకొచ్చాడు బాలయ్య. మరి తన గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా సంక్రాంతి ‘సింహా’లో నిలిచాడో లేదో చూద్దాం పదండి.
కథేంటంటే… నరసింహా(బాలయ్య)కు తన కుమారుడంటే చాలా ఇష్టం. ఆ చిన్నారికి చిన్న సౌండ్ వినిపించినా భరించలేడు. ఎక్కడా వాయ్ లెన్స్ లేని చోట ఆ చిన్నారిని పెంచాలని పలు ప్రాంతాలు తిరిగి.. చివరకు తమిళనాడులోని కుంభకోణంలో సెటిల్ అవుతాడు. అక్కడే ఆలయ ధర్మకర్త(మురళీ మోహన్) వద్ద డ్రైవర్ గా చేరుతాడు. ఓసారి ఆలయ ధర్మ కర్త కుమార్తె(నటాషా దోషి) విలన్ (బాహుబలి ప్రభాకర్) తమ్ముణ్ని హిట్ అండ్ రన్ చేస్తుంది. దాంతో ఆగ్రహించిన విలన్.. తన తమ్ముణ్ని దారుణంగా ప్రమాదానికి గురిచేసిన వారి ప్రాణాలు తీయాలని నటాషా ఇంటికి వస్తారు. అప్పుడు తన తమ్ముడు ప్రమాదంలో గాయపడటానికి కారణమైంది నేనే అని చెబుతాడు నరసింహా. దాంతో విలన్ అండ్ గ్యాంగ్ నరసింహాను చావ బాది వెళ్లిపోతుంది. అంతకు ముందే ఏఎస్పీతో నరసింహాకు వైరం వుంటుంది. ఈ యాక్సిడెంట్ ను సాకు గా చూపి.. నరసింహాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఎఎస్పీ. అలా ఇద్దరికీ టార్గెట్ అయిన నరసింహాకు ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో తన మాజీ ప్రేయసి గౌరి(నయనతార) ఏఎస్పీ భార్య అని.. తాను వున్న కుంబకోణంలోనే ఓ ప్లే స్కూల్ నడుపుతున్నట్టు తెలుస్తుంది నరసింహాకు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ప్రాంతంలో ప్రశాంతంగా జీవించాలనుకుని వెళ్లిపోదామని డిసైడ్ అవుతాడు నరసింహా. ఇంతలోనే యాక్సిడెంటులో తీవ్రంగా గాయపడిన విలన్ తమ్ముడిని ఎఎస్పీ దొంగచాటున చంపేస్తాడు. దాంతో నరసింహామీద విలన్ కు పగ పెంచుకుని.. నరసింహా మూడేళ్ల కుమారుడిని చంపాలనుకుంటాడు. అలా తన మూడేళ్ల కుమారుణ్ని విలన్ గ్యాంగ్ తీసుకెళ్లిందని తెలియగానే క్షణాల్లో అక్కడికి చేరుకు విలన్ గ్యాంగ్ ను చిత్తు చేస్తాడు నరసింహా. అలా రక్షించిన చిన్నారి తన కుమారుడేనని ఎఎస్పీ వచ్చి నరసింహాకు థ్యాంక్స్ చెబుతాడు. తమ బిడ్డను రౌడీల బారి నుంచి కాపాడింది నరసింహేనని తన భార్య గౌరి(నయనతార)కు చెబుతాడు. అలా తమ బిడ్డను రక్షించిన నరసింహాను.. ఇక జన్మలో తనకు ముఖం చూపించొద్దని గౌరి ముఖం మీదే చెప్పేసి వెళ్లిపోతుంది. గౌరి.. నరసింహాను అలా ఎందుకు అన్నది? వీరిద్దరికీ సంబంధం ఏంటి? అసలు నరసింహా ఎవరు? గౌరి కుమారుణ్ని విలన్ ఎందుకు చంపాలనుకుంటాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: ఇలాంటి రొటీన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు గతంలో చాలా చూశాం. అంతెందుకు బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలే వున్నాయి. అలాంటి స్టేల్ స్టోరీనే దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఎంచుకుని.. దానికి పూర్తి మాస్ మసాలాను జోడించాడు. దాంతో బాలయ్యను ఎలాగైతే ఫ్యాన్స్ చూడాలనుకుంటారో… అలానే తెరపై చూపించాడు. దాంతో ఈ సినిమా కేవలం బి, సి సెంటర్ల ఆడియన్స్ కోసమే తీసినట్టు అనిపిస్తుంది. ఏమాత్రం క్లాస్ ఎలిమెంట్స్ లేని ఈ మూవీ కేవలం మాస్ అండ్ బాలయ్య అభిమానుల కోసమే అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో బాలయ్యను అగ్నాతంలో వున్న ఓ మాస్ పనివానిగా చూపించి మెప్పించాడు దర్శకుడు. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించి చెప్పే ఎపిసోడ్ సినిమాకే హైలైట్. ఆ తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్ ను కూడా ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకెండాఫ్ పై ఆసక్తిని పెంచేశాడు. ఇక సెకెండాఫ్ లో ఓ మెకానిక్ గా బాలయ్యను చూపించి… అందులోనే నయనతార లవ్ స్టోరీని కూడా చూపించారు. ఇది చాలా సిల్లీగా వున్నా… హరిప్రియను పెళ్లి చేసుకుని.. ఆ తరువాత ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం… వారిలో ఒకరిని నయనతార బిడ్డగా పంపించడం.. హరిప్రియ మరణం లాంటి వన్నీ సెంటిమెంట్ ను పంచేవే. ఇక క్లైమాక్స్ పూర్తిగా మాస్ కోసమే అన్నట్టుగా బాలయ్య ఎనర్జీని ఫుల్ గా చూపించేశాడు దర్శకుడు. ఓవరాల్ గా ఈ సినిమా ఫక్తు మాస్ మసాలా మూవీ. కేవలం బాలయ్య ఫ్యాన్స్ కోసమే.
బాలయ్య ఫుల్ ఎనర్జీని చూపించాడు. ముఖ్యంగా అమ్మకుట్టి అనే పాటలోనూ… యాక్షన్ సీన్స్ లో  తన గత చిత్రాల్లాగే ఫెల్ ఎనర్జీని చూపించారు. అయితే మేకప్ సరిగా లేకపోవడంతో వయసు పైబడినట్టు బాలయ్య చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అతని సరసన నటించిన నయనతార నటన బాగుంది. అయితే వీరి మధ్య తెరకెక్కిన లవ్ ఎపిసోడ్ మాత్రం చాలా సిల్లీ గా వుంది. అలానే మరో ఇద్దరు కథానాయికలు హరిప్రియ, నటాషా పాత్రలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. విలన్ పాత్రలు పోషించిన కాలకేయ ప్రభాకర్, అశుతోష్ రాణాలు విలన్లుగా మెప్పించారు. బ్రహ్మానందం కామెడీ మరీ సిల్లీగా వుంది. ప్రకాష్ రాజ్ పాత్ర పరిమితంగానే వున్నా.. ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ సోసో గా వున్నాయి.
దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రాసుకున్న కథ.. కథనాలు అన్నీ ఓల్డ్ 90’sలో లాగ వున్నా.. బాలయ్య తన మాస్ ఇమేజ్ ను బాగా చూపించారు. సెకెండ్ హాఫ్ మరింత దృష్టి సారించి వుంటే బాగుండేది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం బాగుంది. రెండు పాటలతో పాటు… యాక్షన్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగ చేశాడు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకా చేయాల్సింది. దాదాపు 2.43 గంటల నిడివి కావడంతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
మంత్రి దేవినేని పై కేసు ఎందుకంటే
మైనింగ్ శాఖ మీద మంత్రి కెటి రామారావు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *