కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కుంటున్న బ్యాంకొళ్లు

* బ్యాంకుల‌ను ముంచుతుంది అధికారులే!
వ‌రుస‌గా బ్యాంకుల‌ను ముంచుతున్న ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. ఇవాళ కూడా రూ.14కోట్ల మేర గ్రామీణ స‌హ‌కార బ్యాంకులో మోసం జ‌రిగింద‌ని ప‌త్రిక‌ల‌న్నీ మొత్తుకుంటున్నాయి. విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీ కేసుతో బ్యాంకు కేటు గాళ్ల‌ను ఎలా ప‌ట్టుకోవాలి.. ఎలా మోసం చేసిన మొత్తాని రాబ‌ట్టాల‌ని ఆలోచిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం అస‌లు మోసాలు జ‌ర‌గ‌కుండా ఏం చేయాలి.. బ్యాంకుల‌ను ఎలా ప్ర‌క్షాళ‌ణ ఎలా చేయాల‌ని అనేది మాత్రం ఆలోచించ‌డం లేదు. 
ఎన్న‌డూ లేనిది ఆఛార్జీ.. ఏటీఎం ఛార్జీ అని ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌సూలు చేసి వేల‌ల్లో వేత‌నాలు పొందుతున్న బ్యాంకు అధికారులు అది చాల‌ద‌న్న‌ట్లు మ్యా.. మ్యాల‌కు అల‌వాటు ప‌డి ఉన్న‌వారికే బ్యాంకుల్లో ఉన్న పేదోడి సొమ్ము దోచుకునేందుకు రాచ‌బాట ప‌రుస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్రం మాత్రం ఇంకా మేలు కోవ‌డం లేదు. అప్పు ఏగేస్తే బ్యాంకుల‌ను ఎలా ర‌క్షించాలి. అని మాత్ర‌మే ఆలోచిస్తోంది. దేశ వ్యాప్తంగా రూ.2450 కోట్లు బ్యాంకులు ఇప్ప‌టి వ‌ర‌కు మొడి బ‌కాయిల‌తో న‌ష్ట‌పోయిన‌ట్లు సాక్షాత్తు ఆర్‌బీఐ చెప్పుతోంది. 2013 నుంచి 16 మ‌ధ్య 1232 మోసం కేసులు న‌మోదు కాగా.. వీటి విలు 2450 కోట్ల‌ని తేల్చింది. ఇవి కేవ‌లం రూ.ల‌క్ష ఆపై మోసాలు మాత్ర‌మే .. చిన్న ప‌ద్దులు చిట్టెడు చిట్టెడు పుట్టెడు అయిన‌ట్లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.
అయితే.. ఇలా అప్పులు చెల్లించ‌కుండా మొండి బ‌కాయిలుగా మారిన కేసులు ఎక్క‌డో లేవు.. దిల్లీ పెద్ద‌లు ఎక్క‌డైతే ఎక్కువ ఉంటారో.. అక్క‌డే ఇవి వెలుగు చూడ‌టం గ‌మ‌నార్ఙం. రాజ‌స్థాన్‌లో బ్యాంకు అధికారులు ఈ మోసాల‌కు ఎక్కువ అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ఆర్‌బీఐ తేల్చింది. ఆ త‌ర్వాతి స్థానంలో చంఢీగ‌డ్‌, డిల్లీ, ప‌శ్చిమ బెంగ‌ల్ ముందు వ‌రుస‌లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 70 శాతం కేసులు ఈ రాష్ర్టాల‌లో  ఉన్నాయంటే ప‌రిస్థితి అర్థః చేసుకోవ‌చ్చు. ఒక్క  రాజ‌స్థాన్‌లోనే 1096 కోట్ల మొండి బకాయిలు ఉన్న‌ట్లు లెక్క‌తేల్చారు.
మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు బ్యాంకుల్లో కూడా సిబ్బంది త‌మ చేతి వాటం ప్ర‌ద‌ర్శించి మొండి బాబుల‌కు అప్పులు య‌థేచ్చ‌గా ఇచ్చేస్తున్న‌రు. య‌థేచ్ఛ‌గా శాఖ‌లు పెంచ‌డం, అప్పులు ఇచ్చే క్ర‌మంలో లొసుగులు ఉండ‌టం, రుణ గ్రహీత ఆస్తుల విలువ అంచ‌నా వేయ‌డంలో బ్యాంకు అధికారులు లంచాల‌కు మ‌ర‌గ‌డం, బ్యాంకు ఉన్న‌తాధికారులు రుణ గ్ర‌హీత ప‌లుకుబ‌డికి లొంగ‌డం వంటి వ‌ల్ల నేడు సామాన్యుడి డ‌బ్బుకు భ‌రోసా లేకుండా పోతోంది.
రూ.10 నాణెం చెల్ల‌కుంటే 14440 ఫోన్ చేయండి
ప్రియా ప్ర‌కాశ్ తెలుగు సినిమా క‌న్ఫార్మ్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *