BHAAGAMATHIE MOVIE REVIEW

రివ్యూ: రొటీన్ బాగమతి

రేటింగ్: 2.5

బాహుబలి కంక్లూజన్ తరువాత అనుష్క నటించిన చిత్రం బాగమతి. సైజ్ జీరో సినిమాతో బాగా ఒళ్ళు చేసిన స్వీటీ అనుష్క… బాగా డైట్ చేసి… నటించిన చిత్రం ఇది. పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో UV క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఈరోజే విడుదల అయింది. బాహుబలి సిరీస్ విజయాలతో మంచి ఊపు మీద వున్న అనుష్క… బాగమతిగా ఏమాత్రం ఆకుట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ఐఏఎస్‌ చదివిన చంచల (అనుష్క) కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (మలయాళ నటుడు జయరాం) దగ్గర పర్సనల్ సెక్రెటరీ గా ఉంటుంది. ప్రాణహిత ప్రాజెక్టును కట్టడానికి భూసేకరణ చేయడానికి సంకల్పించగా.. ఆ నిర్వాసితుల తర‌పున శక్తి (ఉన్నికృష్ణన్) పోరాడుతుంటాడు. ప్రాజెక్టు కట్టడానికి సహకరించాలని కోరుతాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఐతే నిర్వాసితుల విషయంలో ఏదో అన్యాయం జరుగుతోంది అని పసిగట్టిన శక్తి… అనుష్క చేతిలో హత్య గావించబడతాడు. దాంతో అనుష్కను జైలుకు పంపుతారు. అదే సమయంలో కేంద్ర మంత్రిని సీబీఐ కేసులో ఇరికించాలని.. జైలు పాలు అయిన చంచల సహాయం తీసుకోవాలని సీబీఐ భావిస్తుంది. మరి చంచల సహాయంతో కేంద్ర మంత్రిని సీబీఐ అరెస్టు చేసిందా? తన ప్రియుడు శక్తిని చంచల ఎందుకు చంపింది? అసలు చంచల బాగమతి గా ఎందుకు మారింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కథ విశ్లేషణ: దర్శకుడు అశోక్ ఈ సినిమా హారర్ కాదు… స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని సెలవిచ్చారు. అంతే కాదు ఇది అసలు బాగమతి స్టోరీ కాదని కూడా చెప్పాడు. ఆ యాంగిల్లో వెళ్లి సినిమాను చూడటానికి వెళ్లినవారికి మొదటి ఓ అరగంట సాధారణ సిన్మాలాగే అన్పిస్తుంది. ఆ తరువాత కథ.. ఉరి బయట ఉన్న బూత్ బంగ్లాకి మారుతుంది. అక్కడి నుంచి మనకు గతంలో చూసిన పిజ్జా, రాజుగారి గది2, అరుంధతి.. ఇలా అనేక చిత్రాలు గుర్తొస్తుంటాయి. అయితే నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ తో వీటిని మరిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథను ముందుకు నడిపిన దర్శకుడు… సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. రొటీన్ కథ.. కథానాలతోనూ.. నేపథ్య సంగీతం తో విసిగించాడు. దాంతో హారర్ జోనర్లో ఓ మంచి సినిమాగా మిగలాల్సిన భానుమతి.. రొటీన్ హారర్ జోనర్ చిత్రాల జాబితాలో చేరింది.

అనుష్క మరోసారి అరుంధతి లా.. బాగమతి పాత్రను పండించింది. ఓ వైపు ఐఎస్ అధికారిగా.. మరోవైపు బాగమతి గా మెప్పించింది. ఆమెకు జంటగా నటించిన ఉన్నికృష్ణన్ పాత్ర కూడా మెప్పిస్తుంది. జనత గ్యారేజ్ లో ఓ చిన్న పాత్రలో కనిపించిన ఇతడు ఇందులో అనుష్క సరసన నటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ అవ్వడనే చెప్పొచ్చు. విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు జయరాం… కన్నింగ్ గాను.. మంచోడిగాను కేంద్రమంత్రిగా బాగా నటించాడు. సీబీఐ పాత్ర పోషించిన లేడీ కూడా బాగా చేసింది. మిగతా పాత్రల్లో మురళి శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లత తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.

దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ రొటీన్ గా రాసుకోవడంతో.. ప్రేక్షకులను నిరాశకు గురి చేశాడనిపిస్తుంది. థమన్ నేపథ్య సంగీతం బాగుంది. సిమెమాటోగ్రఫీ బాగుంది. మది ప్రాణం పెట్టి కెమెరా వర్క్ చేసాడు. ఇతని తరువాత ఆర్ట్ డైరెక్టర్ వేసిన బంగ్లా సెట్టింగ్ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విచిత్ర పనులు చేస్తున్న మాణిక్యాలరావు ..
చిరంజీవికి సీన్ లేదన్న రాములమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *