జియో దెబ్బకు టెలినార్…

జియో సిమ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించకముందు ఏదైన చౌక కాల్‌ మాట్లాడాలని భావించే వారు తప్పకుండా యూనినార్‌ వాడేవిషయం తెలిసిందే.. అది క్రమేణా టెలీనార్‌గా మారింది. ఇప్పుడు టెలినార్‌ కనుమరుగవుతుంది. భారతి ఎయిర్‌టెల్‌  మొబైల్‌ దిగ్గజం టెలినార్‌ ఇండియా గతంలోనే టేకోవర్‌ చేసింది. ఇప్పుడు ఆ విలీనానికి ఎయిర్‌టెల్‌ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొన్న వాటాదారుల్లో  99.98 శాతం ఇందుకు ఆమోదం తెలపడం విశేషం. రిలయన్స్‌ జియో పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా రెండు కంపెనీలు ఈ విలీనం కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిసిఐ, సెబి, బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ జూన్‌లోనే ఆమోదం తెలిపాయి. ఇపుడు వాటాదారులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఎపి, బీహార్‌, మధ్య ప్రదేశ్‌తో సహా మొత్తం ఏడు సర్కిల్స్‌లో టెలినార్‌ ఆస్తులు, ఖాతాదారులు ఎయిర్‌టెల్‌ గూటికి వస్తారు. దాంతో పట్టులేని సర్కిళ్లనూ ఎయిర్‌టెల్‌ జియోకి ధీటుగా నిలబడగలదని భావిస్తున్నారు.
తమిళనాడుపై బీజేపీ మార్కు దాడి
హెచ్‌టీసీ ఫోన్‌ గూగుల్‌ చేతికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *