స్వామిగౌడ్‌పై దాడి నేత‌ల బుకాయింపు

ఉద్య‌మ స‌మ‌యంలో హ‌రీష్‌రావు పోడియం ఎక్కి గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్‌పై దాడి చేయ‌గా లేదా..
ఈటల రాజేంద‌ర్ డ్రైవ‌ర్ లోక్‌స‌త్తా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌య‌ప‌కాశ్ నారాయ‌ణపై దాడి చేయ‌లేదా..
కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధి చ‌ట్ట స‌భ‌ల్లో సోమ‌వారం చేసిన దాడిపై కాంగ్రెస్ నేత‌లు త‌ప్పించుకునేందుకు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వినిపిస్తున్న మాట‌లు. చ‌ట్టాలు త‌యారు చేయాల్సిన ప్ర‌తినిధులు చేసిన చ‌ట్టాల‌ను కాల‌రాస్తూ కేవ‌లం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, దాడుల‌కు దిగుతున్న తీరు వ్య‌వ‌స్థ‌కు మ‌చ్చ తెస్తున్నాయి. వారి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా లేంది.. మేము చేస్తే త‌ప్పు వ‌చ్చిందా.. అని విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం వారు చేసింది త‌ప్ప‌ని మ‌న‌స్సాక్షికి తోచినా బుకాయిస్తున్నారు. అంటే వారి మ‌న‌స్సాక్షినే మోసం చేసుకుంటున్నారు. స్వామిగౌడ్‌పై దాడి మీడియా ద్వారా ప్ర‌చారం అవుతుండ‌టంతో కాంగ్రెస్ నేత‌లు ఉద్య‌మ స‌మ‌యంలో హ‌రీష్‌రావు గ‌వ‌ర్న‌ర్‌పై దాడి చేసిన విజువ‌ల్స్ ను సోష‌ల్ మీడియాలోకి విడుద‌ల చేసి.. మేం చేసింది త‌ప్పుకాదంటున్నారు. 
దీనిపై ఎవ‌రేమ‌న్నారు…
ప్ర‌జాస్వామ్యంపై దాడి..
– స్వామిగౌడ్‌, శాస‌న‌స‌భాప‌తి
ఇది ప్ర‌జాస్వామ్యంపై దాడి. సభ్యుల‌కు ఎలాంటి అభ్యంత‌రాలు ఉన్నా నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంది. స‌మ‌యం ఇంకా చాలా ఉంది. కానీ కాంగ్రెస్ నేత‌లు ఇలా దాడుల‌కు దిగ‌డం స‌రికాదు.
గ‌వ‌ర్న‌ర్‌ను టార్గెట్ చేశారు : శాస‌న స‌భ వ్య‌వ‌హారాల మంత్రి హ‌రీష్‌రావు
ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురావాల‌నే కాంగ్రెస్ ప‌రిస్థితులు దాడి చేశారు. వారు గ‌వ‌ర్న‌ర్‌ను టార్కెట్ చేశారు. కానీ చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోంది.  చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మాలి బ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటాం.  ప‌స‌లేని విమ‌ర్శ‌లు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. బ‌స్సు యాత్ర తుస్సు యాత్ర‌గా మారింది. అందుకే.. అస‌హ‌నానికి లోనై దాడులు చేస్తున్నారు.
గ‌వ‌ర్న‌ర్‌పై దాడి చేయ‌లేదా..: మాజీ మంత్రి గీతారెడ్డి
హ‌రీష్‌రావు గ‌వ‌ర్న‌ర్‌పై దాడి చేశాడు. అప్పుడు ఎలాంటి కేసులు న‌మోదు చేశారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోఎలాంటి ప‌స లేక‌పోవ‌డ‌డంతో
రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదే అనే ఆవేద‌న‌తో అనుకోకుండా చేశారు. దెబ్బే త‌గ‌ల‌లేదు. ఇత‌ర రాష్ట్ర వైద్యుల‌తో ప‌రీక్ష‌లు చేయించి చూపండి అప్పుడు తెలుస్తుంది.
గాయం కాలేదు.. చూపిస్తే రాజీనామా చేస్తాం: కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
దాడిలో ఎలాంటి గాయం కాలేదు. వైద్యులను మెప్పించి అలా పుకార్లు చేస్తున్నారు.  ఎయిమ్స్ వైద్యుల‌తో ప‌రీక్ష‌లు చేయించండి వారు కూడా వారు గాయం అయిందంటే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లుకుతా. లేక‌పోతే వారు సిద్ధ‌మేనా చెప్పండి. రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌నే ఆవేద‌న‌తో ఇలా చేశా.
ట్రంప్ ప‌న్నులేస్తే... మ‌న‌కేంటి..?
అఖిలేశ్‌-మాయావతి మైత్రికి ఝలక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *