క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో.. 600 ప్రాజెక్టుల స‌మాచారం!

క్రెడాయ్ హైద‌రాబాద్ ఆర‌వ ప్రాప‌ర్టీ షోను హైటెక్స్‌లో నిర్వ‌హిస్తోంది. మార్చి 2, 3, 4 తేదీల్లో జ‌రిపే ఈ ప్రాప‌ర్టీ షో సుమారు 600 ప్రాజెక్టుల‌కు సంబంధించిన స‌మాచారం ల‌భిస్తుంద‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు ఎస్‌.రాంరెడ్డి తెలిపారు. 2012 నుంచి హైద‌రాబాద్‌లో ప్రాప‌ర్టీ షోల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని.. ప్ర‌తికూల స‌మ‌యాల్లోనూ అధిక శాతం మంది త‌మ ప్రాప‌ర్టీ షోల‌కు విచ్చేశార‌ని.. ఈసారి కూడా క‌నీసం యాభై వేల‌కు మించిన ప్ర‌జ‌లు ఈ మూడు రోజుల రియ‌ల్ పండ‌గ‌కు విచ్చేస్తార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో అన్‌సోల్డ్ స్టాకు అనేది లేద‌ని.. డెవ‌ల‌ప‌ర్లు ఎప్పుడూ ప్రాజెక్టుల‌ను విడ‌త‌ల‌వారీగా నిర్మిస్తుంటార‌ని.. కాబ‌ట్టి, ప్రాజెక్టు పూర్త‌యిన త‌ర్వాత ఫ్లాట్లు అమ్ముడవ్వ‌క‌పోవ‌డం వంటివి ప్ర‌స్తుతం లేద‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌న‌భూమ్ రామ‌కృష్ణారావు తెలిపారు.

మౌలిక స‌దుపాయాలు మెరుగయ్యే ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయ‌ని.. ఈ పోక‌డ గ‌త కొంత‌కాలం నుంచి హైద‌రాబాద్‌లో ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామ‌ని ముర‌ళీకృష్ణా రెడ్డి వివ‌రించారు. అయినా, ఫ్లాట్ల ధ‌ర‌లు మాత్రం పెర‌గ‌లేద‌న్నారు. క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో నిర్వ‌హించిన త‌ర్వాతే హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో బూమ్ ఏర్ప‌డుతుంద‌ని.. ఈ ట్రెండ్ గ‌త కొంత‌కాలం నుంచి కొన‌సాగుతుంద‌ని రాజేశ్వ‌ర్‌రావు చెప్పారు. రానున్న రోజుల్లో ఇళ్ల ధ‌ర‌లు పెరుగుతాయే త‌ప్ప త‌గ్గే ప్ర‌స‌క్తి ఉండ‌ద‌ని.. కాబ‌ట్టి, సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించేవారికిదే స‌రైన త‌రుణ‌మ‌ని రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తెలిపారు.

బ్రిట‌న్ పిల్ల‌కి పెళ్లి కుదిరింది!
‘తొలిప్రేమ‌’ కావాలంటున్న అఖిల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *