వైద్యుల‌కు ధైర్యం.. రోగుల‌కు భ‌యం

పెద్ద డాక్ట‌ర్ల విచిత్ర స‌దస్సు….న‌గ‌రంలోని ప్ర‌ముఖ వైద్య‌నిపుణులంతా క‌లిసి ఓ విచిత్ర స‌ద‌స్సు పెట్టారు. పైగా దేశంలోనే ఈ స‌ద‌స్సుపెట్ట‌డం తొలి సారి అని ఘ‌నంగా చెప్పుకున్నారు. ఇంతకి స‌ద‌స్సు ఏంటంటే..  యువ వైద్యుల‌కు ధైర్యం నూరి పోసేందుకు  ఓ చ‌ర్చ ఏర్పాటు చేశారు. ఇందులో న‌గ‌ర కాదు కాదు.. రాష్ట్ర, దేశ వ్యాప్తంగా పేరొందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. సోమ‌రాజు, హ‌రిప్ర‌సాద్‌, గుర‌వారెడ్డి, శోభ‌నా.కే. ఇంకా ప్ర‌ముఖులంతా వ‌చ్చారు.  ఓ పంచ‌తార‌ హోట‌ల్‌లో కూర్చొని రోజంతా చ‌ర్చించారు.  ఆ త‌ర్వాత సాయంత్రం వ‌చ్చి విలేక‌ర్ల స‌మావేశం పెట్టి..  రోగులు, వారి బంధువులు.. యువ వైద్యులు అదేనండీ కొత్త‌గా వైద్యుడిగా వ‌చ్చిన వారిని బెదిరిస్తున్నార‌ని, మీడియా దీన్ని బూత‌ద్దంలో చూపించి వైద్యుల‌ను విలన్లుగా చూపుతోంద‌ని ఈ ప‌రిస్థితి స‌రికాద‌ని, మీడియా కూడా రెండు వైపులా ఆలోచించాల‌ని పేర్కొన్నారు. ఈ తీరు ఇలా నే ఉంటే భ‌విష్య‌త్తు వైద్యులు అభ‌ద్ర‌తా భావంలో ప‌డిపోతార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే మా వైద్యులు ఇత‌ర దేశాల్లో కంటే 10శాతం ఎక్కువ మంది హృద్రోగాల‌తో బాధ‌ప‌డుతున్నారని వివ‌రించారు. ఎంత ఒత్తిడి ఉంటే వైద్యుల‌కే ఇలాంటి రోగాలు వ‌స్తాయి చెప్పండి అని మీడియా ముందు గోడు వెల్ల‌బోసుకున్నారు. పాపం ముస‌లి వైద్యుల‌కు కొత్త వైద్యులంటే ఎంత ప్రీతో అర్థం అయింది. 
మ‌రి ఇందులో 10 శాతం రోగుల సేవ‌ల్లో ఎందుకు త‌రించ‌రో మాత్రం అర్థం కావ‌డం లేదు. మీడియా మొత్తం రోగుల‌కే బాస‌ట‌గా ఉన్న‌ట్లు చెప్పుకు రాగా చాలా మంది విలేక‌ర్లు న‌వ్వు ఆపుకోలేక కిసుక్‌మ‌న్నారు.  -ఎన్ని ప్రాణాలు మింగినా ఏ మీడియా మీ మా పాపాలు బ‌య‌ట పెట్టింద‌ని – అక్క‌డే ఉన్న ఓ ఆంగ్ల ప‌త్రిక విలేక‌రి ప‌క్కోడితో అన్నారు. -ఐనా మీడియా అంటున్నారు… ఎక్క‌డుంద‌న్నా.. మీడియా వారితో చేతిలోనే ఉంది.. క‌దా – అని మ‌రో మిత్రుడు నిట్టూర్చాడు. లేక‌పోతే ఏంటి.. బేగంపేట‌లోని నేత్ర వైద్య ఆస్ప‌త్రిలో  ప‌ని చేసే వైద్యురాలికే క‌న్ను పోయేలా చికిత్స చేశారు.. ఆమె బంధువులు న్యాయం చేయాలని తిరిగి తిరిగి మీడియాకు లీకు చేసి, విలేక‌ర్ల స‌మావేశం పెట్టి మ‌రీ చెప్పితే ఏ ప‌త్రిక‌లో వ‌చ్చింది.? ఏ టీవీలో వ‌చ్చింది..? అదే ఆస్ప‌త్రిలో వైద్యుడు త‌ప్ప‌డు శ‌స్త్రచికిత్స చేస్తే బాధితుడి బంధువుల ఆస్ప‌త్రిపై దాడులు చేశారు.. మ‌రి ఏ మీడియా ఎందుకు దాన్ని క‌వ‌ర్ చేయ‌లేదు. ఈ విష‌యాలు ఏవీ తెలియ‌న‌ట్లు న‌టిస్తూ మీడియాను ఆడిపోసుకోవ‌డం త‌గ‌దు. పాపం మీడియా పెట్టుబ‌డిదారులు అంటే మీలాంటి..వారి చేతిలో ఏనాడో కీలు బొమ్మైంద‌ని ప్ర‌జ‌ల‌కు తెలుసు.
ఇక యువ వైద్యుల‌పై వృద్ధ వైద్యుల‌కు పుట్టుకొచ్చిన జాలి. ఇక్క‌డ ఏ వైద్యుడూ త‌క్కువ తిన‌లేదు. ఆరోగ్య‌శ్రీ, ఈహెచ్ెస్‌, జేహెచ్ఎస్ వంటి ప‌థ‌కాల‌తో రోగి వ‌స్తే చాలు బేరం పోతుంద‌ని పీఆర్‌వో ల‌ను పుర‌మాయించి మ‌రీ కోసేస్తున్నారు.. క‌డుపు కొట్టేస్తున్నారు.  ముందు ఆ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించండి.
స్టెంట్ల ధ‌ర‌లు 70శాతం కంటే త‌గ్గినా పేదోడి గుండెపై డ‌బ్బుక‌ట్ట‌ల భారం ఇంకా మోపుతున్నారు.. దానిపై ఎందుకు అవ‌గాహ‌న క‌ల్పించ‌రు. ఒక వైద్యుడి ద‌గ్గ‌ర చూపించుకుని అవ‌గాహ‌న‌కో, అపోహ‌లు తీర్చుకునేందుకో మ‌రో వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్తే క‌నీసం నాడీ కూడా ప‌ట్ట‌ని వారున్నారు.. ముందు ఈ ఇగో వ‌దులుకోవాల‌ని చెప్పండి.
మాన‌వ విలువ‌లు మ‌రిచి రూ.కోట్లు పెట్టి చ‌దివాం.. ఆ కోట్లు సంపాదించేందుకు ఎన్ని క‌డుపులు కొట్టాలో పొద్ద‌స్త‌మానం ఆలోచించే వైద్యుల‌కు క‌ల్పించండి ప్ర‌తి నెలా అవ‌గాహ‌న‌.
వైద్యుడే దేవుడు అని రోగి నిత్యం న‌మ్ముతాడు ఆ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది.. దాన్ని నిరూపించుకోవాల‌ని చెప్పండి.. ఇదేదో నేటి త‌రం, రేప‌టి త‌రం కాదు త‌ర‌త‌రాల‌కు నిలిచి ఉండాలంటే వైద్య వృత్తిలోకి రాగానే దోపిడే మార్గంగా కాకుండా కాసింత సేవా దృక్ప‌థం అల‌వ‌ర్చుకోవాల‌ని చెప్పండి.
షాకింగ్: చైనాలో జీవితకాల పాలన?
పడి పడి లేస్తున్న శ‌ర్వా మనసు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *