04-02-2018 నుండి 10 వరకు వారఫలాలు

మేష రాశి …..ఈవారం మొత్తంమీద సామాజికకార్య క్రమాల విషయంలో మక్కువను కలిగి ఉంటారు. మీయొక్క ఆలోచనలు నలుగురికి సహాయపడేవిగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.ఉద్యోగంలో అభివృద్దిని పొందుతారు ,ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని వెళ్ళుట సూచన. అనవసరమైన ఖర్చుల విషయంలో భాద్యత కలిగి ఉండుట అవసరం. చర్చల విషయంలో మక్కువ ఉంటుంది. సమయాన్ని వృధాచేయుట వలన నష్టపోయే ఆస్కారం కలదు. నూతన పనులను ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మొండితనం వలన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త.                     

వృషభ రాశి ….. ఈవారం మొత్తంమీద సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అవసరం. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సరైన సమయంలో మొదలుపెట్టుట మంచిది. చర్చాపరమైన విషయాల్లో సమయాన్ని గడిపే అవకాశం కలదు కావున సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు అలాగే విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపతే నష్టపోయే ఆస్కారం ఉంది జాగ్రత్త. బంధువుల నుండి నూతన విషయాలు తెలిసే ఆస్కారం కలదు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం వలన మేలుజరుగుతుంది.       

మిథున రాశి ……ఈవారం మొత్తంమీద మీయొక్క ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన సూచన. తలపెట్టిన పనులను కాస్త అధికమైన శ్రమతో పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో పెద్దల నుండి వచ్చు సూచనలు మిమల్ని కాస్త అసంతృప్తికి లోనుచేసే అవకాశం ఉంది. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. దైవసంభందమైన విషయాల్లో సమయాన్ని ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో లేక వృత్తిలో నూతన మార్పులు ఏర్పడుటకు ఆస్కారం కలదు.    
 
కర్కాటక రాశి ……
ఈవారం మొత్తంమీద సంతానం విషయంలో ఒత్తిడిని పొందుతారు. వారిగురుంచి నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. ఉద్యోగంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే ఆదాయంకు తగ్గట్టుగా ఖర్చులు కలిగి ఉంటారు. దూరప్రదేశం లేదా విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. అధికారులతో కలిసి నూతన చర్చలు చేయుటకు అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ఆలోచన లేకపోతే నూతన సమస్యలు ఏర్పడుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. భోజనం విషయంలో ప్రత్యేకమైన ఇష్టాన్ని చూపిస్తారు. మిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. కుటుంబంలో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు సర్దుబాటు అవసరం.           


సింహ రాశి ……ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. సమయాన్ని అనుగుణంగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేయుట అన్నివిధాల ఉత్తమం. నూతన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది, చిననాటి మిత్రులను కలుస్తారు. వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటికి సమయాన్ని ఇస్తారు. వాహనముల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అన్నివిధాల మంచిది. అధికారుల నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది.

కన్యా రాశి ……ఈవారం మొత్తంమీద మానసికపరమైన విషయాల్లో ఆరంభంలో ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. కావున నూతన నిర్ణయాల విషయంలో సర్దుబాటు అవసరం. మీయొక్క మాటతీరు కాస్త ఆవేశం లేకుండా చూసుకోవడం వలన వివాదాలు తగ్గుటకు అవకాశం కలదు. మిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వారితో నూతన విషయాలను ఆరంభించుట అలాగే చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన లబ్దిని పొందుతారు. జీవితభాగస్వామితో స్వల్ప మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం కలదు సర్దుబాటు అవసరం. ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీకు నచ్చిన పనులకు సమయాన్ని కేటాయించే ఆస్కారం ఉంది.

తులా రాశి …….ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోని మార్పులకు ఆస్కారం కలదు. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీయొక్క ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలను కార్యరూపం దాల్చే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. సోదరసంభందమైన విషయాల్లో కొంత అసంతృప్తిని కలిగి ఉంటారు. కుతుభంలో చాలావరకు సర్దుబాటు విధానం ఆవలంభించుట అనేది సూచన. జీవితభాగస్వామితో నూతన చర్చలు చేస్తారు. వారి కుటుంబసభ్యుల నుండి నూతన సూచనలు లభించే అవకాశం కలదు. ఆర్థికంగా సాధారణ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి …….ఈవారం మొత్తంమీద ఖరీదైన ఆలోచనలు కలిగి ఉంటారు , ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే కొంత నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. పనులకు సంభందించి సరైన ప్రణాళిక ఉండుట వలన వాటిని సమయానికి పూర్తిచేసే ఆస్కారం కలదు. అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క మాటతీరు మూలాన కొన్ని కొన్ని పనుల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో వ్యక్తుల ఆలోచనలు మిమ్మల్ని సందేహంలో పడేసే ఆస్కారం కలదు. అనవసరమైన విషయాల్లో ఏమాత్రం తలదూర్చక నిబందనలు పెట్టుకొని మీ పరిధులలో మీరు ఉండుట సూచన.
 

ధనస్సు రాశి ……ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో కలిసి సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన మొదలు పెట్టుట యందు ఇష్టంను కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి,ప్రయాణాలకు సమయం ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. కుటుంబసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లితరపు బంధువుల మూలాన నూతన సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది సూచన. ఉద్యోగంలో మొండి నిర్ణయాలు తీసుకోవడం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. అధికారులతో కలిసి చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.          

మకర రాశి ……ఈవారం మొత్తంమీద బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం కలదు. పనులమూలాన శ్రమను పొందుతారు. మిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో స్పష్టమైన ఆలోచన లేకపోతే అనవసరమైన మనస్పర్థలు ఏర్పడే అవకాశం కలదు. ఆవేశాన్ని కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రతగా లేకపోతే అనుకోని ఖర్చులు పొందుటకు ఆస్కారం ఉంది. సోదరి / సోదరులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది. సంతానం మూలాన కొంత ఒత్తిడిని పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడే ఆస్కారం కలదు.

కుంభ రాశి ……ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన పనులను ఆరంభించే ఆస్కారం కలదు. చేపట్టిన పనులకు గాను సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. నూతన ప్రయత్నాలు మిత్రులతో కలిసి చేయుట వలన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అధికారులతో జరిగే చర్చల్లో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. మీయొక్క మాటతీరు మూలాన గతంలో ఆగిపోయిన పనులను ముందుకు తీసుకెల్లుటకు ఆస్కారం ఉంది. సోదరులతో స్వల్ప మనస్పర్థలకు ఆస్కారం కలదు జాగ్రత్త.         

మీన రాశి ……..ఈవారం మొత్తంమీద కుటుంభంలో స్వల్ప మార్పులకు ఆస్కారం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి చేసే చర్చల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట మంచిది. సంతానం మూలాన నూతన ఖర్చులు ఏర్పడుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట అవసరం. దూరప్రదేశం నుండి విలువైన సమాచరం లభిస్తుంది. పెద్దలతో చేయు చర్చల విషయంలో వారికి అనుగుణంగా నడుచుకోండి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది .తలపెత్తిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. గతంలో తీసుకున్న రుణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట అవసరం.    

రెండో వన్డేలో సఫారీలు చిత్తు!
దుర్ముహూర్తం మ‌ధ్యాహ్నం 12.53 ని.షా నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *