కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంచ‌లన‌ నిర్ణ‌యం

శాస‌న స‌భాప‌తి స్వామిగౌడ్ పై దాడి విష‌యాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కాగానే దాడికి పాల్ప‌డ్డ వారిని సంస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఉద్య‌మ స‌మ‌యంలో తెరాస స‌భ్యులు చేసిన ప‌నుల‌ను సాకుగా చూపి ప్ర‌స్తుత శాస‌న మండ‌లి స‌భాప‌తి స్వామిగౌడ్‌పై దాడి చేయ‌డం కాంగ్రెస్ ఎమ్మెల్యేల త‌ప్పిద‌మే. స‌భలో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, స‌భా నిబంధ‌న‌లు ఎలా ఉన్నాయి అనే విష‌యాల‌పై స‌భ్య‌లు అవ‌గాహ‌న క‌ల్పించాల‌మో అన్న‌ట్లు స‌భ్యులు ప్ర‌వ‌ర్తించారు. మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు, స‌భ‌లో అనుచిత ప్ర‌వ‌ర్త‌న చేస్తే స‌హించేది లేద‌ని సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు చెబుతూనే ఉన్నారు. ప‌చ్చి విమ‌ర్శ చేసినా.. గత స‌భ‌లో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇప్ప‌డు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, సంప‌త్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. కానీ అప్ప‌ట్లో తెదేపాలో రేవంత్ ఉంటే.. ఆ పార్టీ నేత‌లు అంత‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్ప‌డు కాంగ్రెస్ నేత‌లు సస్పెన్ష‌న్‌పై ఘాటుగా స్పందించారు. 11 మంది మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేస్తున్న ప్ర‌క‌టించారు.

దాడి చేయ‌లేదు ఆవేద‌నతో క్ష‌ణికావేశంలో చేసిన ప‌నికి ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా.. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మా? నియంతృత్వ ప్ర‌భుత్వమా? అని విమ‌ర్శిస్తూ.. స‌స్పెన్ష‌న్ ప్ర‌క‌ట‌న స్పీక‌ర్ చ‌ద‌వగానే కాంగ్రెస్ స‌భ్యులంతా శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డి నేతృత్వంలో స‌మావేశం అయ్యారు. వారు మ‌న‌ల్నేంది స‌స్పెన్ష‌న్ చేసేది.. మ‌న‌మే ముందు మూకుమ్మ‌డిగా రాజీనామా చేద్దాం అని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు దిల్లీలోని అధిష్ఠానానికి ఈ విష‌యం చెప్పారు. అక్క‌డ కూడా గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.

అయితే ఈ నిర్ణ‌యం కాంగ్రెస్‌కు ఏ విధంగా లాభిస్తుందో వారే అర్థం చేసుకోవాలి. ప్ర‌జ‌లు ప్ర‌త్యేక ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన దాడుల‌తో పోల్చి దీన్ని చూస్తారా అంటే అనుమానమే. గ‌వ‌ర్న‌ర్‌ను టార్గెట్ చేసి దాడి చేసి.. ఇప్ప‌డు ప్ర‌బుత్వంపై అలిగి రాజీమానా చేయ‌డం .. ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన దాడుల‌ను ఎలా పోల్చి చూస్తారు. గ‌తంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌, వీహెచ్ వంటి నేత‌లంతా క‌లిసి వెళ్లారు. అప్ప‌డు గ‌వ‌ర్న‌ర్ వారిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. లేని పోని విమ‌ర్శ‌లు మాని ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని సూచించ‌గా.. కాంగ్రెస్ నేత‌ల‌కు అప్ప‌టి నుంచి గ‌వ‌ర్న‌ర్‌పై కోపం వ‌చ్చింది. అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్‌ను భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కూడా కొన్నాళ్లు ప్ర‌చారం చేశారు. కానీ వీరి మాట‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మ‌ళ్లీ స‌భ‌లో ఇలాంటి దారుణానికి పాల్ప‌డ్డారని ప్ర‌జ‌ల‌కు తెలుసు. అందుకే వీరి రాజీనామాలు అంత‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

ఆ రైతుల‌ను చూసైనా నేర్చుకోండి!
పూజ ప్రేమ‌లో ప్ర‌భాస్‌...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *