హెచ్‌టీసీ ఫోన్‌ గూగుల్‌ చేతికి

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా ఇండియాలో అయితే అది రెట్టింపు ఉంది. ఈ తరుణంలో వచ్చే పోటీని పెద్ద కంపెనీలు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. అందుకే తైవాన్‌కు చెందిన టెక్‌ కంపెనీ హెచ్‌టిసి స్మార్ట్‌ఫోన్ల విభాగాన్ని అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ చేతికి వెళ్లింది. 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,040 కోట్లు) భారీ ఆఫర్‌తో గూగుల్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ల వంటి హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల మార్కెట్‌లోనూ పట్టు పెంచుకోవాలని గూగుల్‌ భావిస్తున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ గూగుల్‌ మోటారోల స్మార్ట్‌ఫోన్ల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన పెద్దగా సక్సెస్‌ కాలేక పోయింది. 2012లో 1250 కోట్ల డాలర్లకు మోటారోలాను కొని, రెండేళ్లలోనే దాన్ని చైనాకు చెందిన  లెనోవ గ్రూపుకు 290 కోట్ల డాలర్లకు అమ్ముకుంది. ఈ డీల్‌ ద్వారా హెచ్‌టిసికు చెందిన స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం, 2,000 మంది ఉద్యోగులు గూగుల్‌కు బదిలీ కానున్నారు. మరి మోటోని తను అనుకున్న రీతిలో మార్కెట్‌లో ప్రెజెంట్‌ చేయలేని గూగుల్‌ హెచ్‌టీసీని ఏ మేరకు నెట్టుకొస్తుందనేది మిలియన్‌డాలర్ల..
జియో దెబ్బకు టెలినార్...
ఆయూబ్ ఖాన్ మృతి...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *