ఉద్యమ సమయంలో మీరు గొడవలు చేయలేదా?

తెలంగాణ మంత్రికి ఊహించని ప్రశ్న ఎదురైంది. కానీ ఏమాత్రం తడబడకుండా అవును నేను గొడవ చేశానని ఒప్పుకున్నారు మంత్రి హరీష్ రావు. వివరాలలోకి వెళ్తే…విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై హరీష్ విరుచుకుపడ్డాడు. అయితే ఈ సమావేశంలో ఓ విలేఖరి ప్రశ్నిస్తూ మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో గొడవలు చేయాలేదా అంటూ షాకింగ్ ప్రశ్న వేశారు హరీష్ కు. అయితే దీనికి హరీష్ సమాధానం…

అవును నేను గొడవ చేశాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన తెరాసా పార్టీకి శాసనసభలో మాట్లాడే ఛాన్సు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణను అసలు పట్టించుకోవడం కాదు కదా..తెరాసా నాయకులు శాసనసభలో గళం వినిపిస్తుంటే మైకులు కట్ చేసేవారు ఉమ్మడి పాలకులు అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము శాసనసభలో గొడవలకు దిగాం తప్ప కాంగ్రెస్ నేతల మాదిరిగా మండలి ఛైర్మన్ పై విచక్షణ రహితంగా మైకులు విసిరేయడం, రక్తాలు వచ్చేలా కంటికి బలమైన గాయాలు ఇలాంటి చర్యలకు మేము పోలేదంటూ చెప్పారు.

అంతకముందు జరిగిన విషయం తెలిసిందే..కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ పై మైకు విసిరారు. ఈ క్రమంలో మైకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి బలంగా తగిలింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రశ్నిస్తున్న మంత్రి హరీష్ కు మీరు గతంలో గొడవలు చేయలేదా అన్న ప్రశ్న విలేఖరి నుంచి ఎదురైంది. కానీ దానికి హరీష్ రావు సమాధానం స్పష్టంగానే ఉంది.

70ఏళ్ల చరిత్ర నేర్పింది ఇదేనా?
రజినీకి మాటలు రావా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *