బావ బాబుమోహ‌న్‌, నా కంటూ ముందుండేవాడు!

బ్ర‌హ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ బిరుదు ప్ర‌దానం!
త‌న న‌ట‌న‌తో రెండు ద‌శాబ్దాల నుంచి తెలుగు ప్రేక్ష‌కుల చేత న‌వ్వులు పువ్వులు పూయిస్తున్న హాస్య‌న‌టుడు డాక్ట‌ర్ బ్ర‌హ్మ‌నందం. ఆనందాన్ని పేరులోనే నింపుకున్న ఆయ‌న‌ను ‘హాస్యనట బ్రహ్మ’ బిరుదుతో స‌త్క‌రించింది టీఎస్ఆర్ కాక‌తీయ ల‌లిత క‌ళాప‌రిష‌త్‌. కాక‌తీయ‌ర క‌ళ‌వైభ‌వ మ‌హోత్స‌వం సంద‌ర్భంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఆదివారం రాత్రి ప్ర‌ముఖ సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయకులు అంద‌రూ క‌లిసి బ్ర‌హ్మానందాన్ని ఘ‌నంగా స‌న్మానించారు. 

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం మాట్లాడుతూ…‘‘నేనో సామాన్య న‌టుడిని. కాని సుబ్బిరామిరెడ్డి అలా కాదు. ఆయ‌నో పారిశ్రామిక వేత్త‌, రాజ‌కీయ నేత‌, మాన‌వ‌తా వాది, అన్నింటికీ మించి ఆక‌లితో ఉన్న‌వారు క‌నిపిస్తే, ఆదుకుని అన్నం పెట్టే ఆన్నార్తుడు. అందుకే ఆయ‌న నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయ‌నే ఫోన్ చేసి ‘నీకో బిరుదు ఇస్తున్నా… మ‌హాబూబ్‌న‌గ‌ర్ రావ‌య్యా…’ అంటే, రాకుండా ఉండ‌గ‌లనా! కాక‌తీయ సామ్రాజ్యం గురించీ, కాక‌తీయుల వైభవం గురించి మాట్లాడే అర్హ‌త మ‌న‌కు లేదు. అత్యద్భుత‌మైన పాల‌న‌ను అందించారు కాక‌తీయులు. టి.సుబ్బిరామిరెడ్డిగారికీ కాక‌తీయుల‌కు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో మాత్రం నాకు తెలియ‌దు కానీ ఆనాటి కాక‌తీయులు క‌ళావైభ‌వాన్ని, సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు ఇలా కాక‌తీయ క‌ళా మహోత్స‌వం పేరిట నిర్వ‌హిస్తూ, కాక‌తీయుల గొప్ప‌త‌నాన్ని తెలంగాణ వాడ‌వాడ‌లా చాటుతున్నాడు. ఇది దైవ‌సంక‌ల్ప‌మే. సింహం ప‌డుకున్న‌ప్పుడు, చిన్న చిన్న ఈగ‌లు దాని మీద వాలి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈగ‌ల మీద కోపంతో సింహం నిద్ర మానుకుని లేచి, గొడ‌వ పెట్టుకోవాల‌ని చూడ‌దు. అలా చేసినా ఈగ‌లు వినిపించుకోవు. అర్థం చేసుకోవు. టైం వేస్ట్ త‌ప్ప‌. అందుకే సుబ్బిరామిరెడ్డి గురించి ఎంత చెప్పినా, ఆయ‌న‌కి మ‌నం ఈగ‌ల్లా ఇబ్బంది పెట్టిన వాళ్ల‌మే అవుతామంతే.

నేను సినిమా ఇండ‌స్ట్రీలో బాబుమోహ‌న్‌, గుండు హ‌నుమంత‌రావు, మోహ‌న్‌బాబు వంటి చాలా త‌క్కువ మందిని మాత్ర‌మే వ‌రుస పెట్టి పిలుస్తుంటా! గుండు హ‌నుమంత‌రావు ఇప్పుడు ఇక్క‌డ లేక‌పోవ‌డం బాధాక‌రం. ఇక‌పోతే బాబుమోహ‌న్ ఆయ‌న ఓ అద్భుత‌మైన న‌టుడు. మేమిద్ద‌రం క‌లిసి న‌టించేట‌ప్పుడు, ఒక‌నోక స్టేజీలో బావ నా కంటే ముందుండేవాడు. నేను కామెడీ పాత్ర‌లు వేయ‌డానికే స‌చ్చిపోతుంటే, బావ బాబుమోహ‌న్ మాత్రం విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అద్భుత‌మైన పాత్ర‌లు పోషించి, క‌ళ పట్ల అత‌నికున్న అభిమానాన్ని, క‌మిట్‌మెంట్‌ని నిరూపించుకున్నాడు. త‌మ్ముడు ఆలీ, మ‌రో త‌మ్ముడు మిమిక్రీ శివారెడ్డి కూడా తెర మీద‌, తెర వెన‌కా మంచి ప్రోత్సాహం ఇచ్చారు. రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, జ‌య‌ప్ర‌ద నా స‌న్మాన కార్య‌క్రమానికి రావ‌డం ఆనందంగా ఉంది. అలాగే అద్భుత‌మైన క‌ళాకారులు గోర‌టి వెంక‌న్న‌, సుద్దాల అశోక్ తేజ‌, చంద్ర‌బోస్ లాంటి గొప్ప వ్య‌క్తులు ఇక్క‌డ, తెలంగాణ గడ్డ మీద పుట్టారు. వారంద‌రి నా న‌మ‌స్కారాలు…’’ అని అన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రూ బ్ర‌హ్మానందం గొప్ప‌త‌నం గురించి మాట్లాడారు. అనంత‌రం అతిథులంతా క‌లిసి బ్ర‌హ్మానందాన్ని ఘ‌నంగా సత్క‌రించారు. మ‌ధుసూద‌నా చారి బ్ర‌హ్మ‌నందంకు బంగార కంక‌ణం తొడిగారు. వీణ‌ను, జ్ఞాపిక‌ను బ‌హుక‌రించారు.

జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న‌ పోలీసు స్టేష‌న్లు!
ప‌వ‌న్‌కి అన్ని డ‌బ్బులెలా వ‌చ్చాయి చెప్మా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *