గతంలో జీవో 45…నేడు జీఎస్టీ…

గతంలో మాంద్యం మాయమైందనే సంతోషం నిలువకముందే…రాజకీయ ఊపందుకుంది. దీని ఫలితంగా మహా నగరం హైద్రాబాద్ లో నిర్మాణ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పరిస్థితుల్ని బట్టి కొంత కోలుకున్నప్పటికీ నిర్మాణ రంగంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ప్రస్తుతం నగరంలో రియల్ మార్కెట్ పరిస్థితులపై అంచనా వేసిన రియల్ నిపుణులు మున్ముందు ఇళ్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయని ముందే ఊహించి చెప్పిన విషయం తెలిసిందే.

 తెలంగాణ ఆవిర్భవించక మునుపు నగరంలో బడా నిర్మాణాలు తక్కువనే చెప్పాలి. అక్కడక్కడ ప్రాజెక్టులు చెపట్టినా అవి మార్కెట్ కొరతనూ తీర్చలేదు. అయితే ఒక్క సారిగా జీవో 45 వచ్చి పడటంతో నిర్మాణ సంస్థలు ఉలిక్కిపడ్డ మాట వాస్తవమే. అమ్మకాల్లేక రియల్ రంగం పరిస్థితి దారుణంగా ఉంటే సందట్లో సడేమియాలా ఈ 45జీవో వచ్చి రియల్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. జీవో 45 సారాంశం ఏంటంటే…ఎకరా లేదా అంత కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడితే నిరుపేదలకు 20శాతం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నది సారాంశం. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు చిన్నసైజులోనే నిర్మాణాలు చేపట్టాలని భావించారు. కానీ చిన్నసైజులో నిర్మాణాలు చేపడితే గిరాకీ మాటేంటి? అసలు రియల్ రంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నసైజు ప్రాజెక్టులు సబబేనా? అయితే ఇదంతా బి ఫోర్ తెలంగాణ. ఇప్పుడున్న పరిస్థితులు, బిల్డర్లు వేరు. తెలంగాణ ఏర్పడ్డాకా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ రంగం ఊపందుకుంది. విదేశీ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో హైద్రాబాద్ రియల్ రంగానికి రెక్కలొచ్చాయి. అయితే అప్పుడు జీవో 45 రియల్ కు దెబ్బ అయితే మరి ఇప్పుడున్న జీఎస్టీ ప్రభావం రియల్ రంగంపై ఎలా ఉంది?

జీఎస్టీ అనేది మహా నగరాల వరకు ఓకే గానీ జిల్లా స్థాయిలో ఉన్న బిల్డర్ల పరిస్థితే దారుణంగా ఉంది. జిల్లా స్థాయి నిర్మాణ సంస్థలకు ఈ జీఎస్టీ అంతగా నొప్పట్లేదనేది ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తే బాగుంటుందని బిల్డర్ల ఎదురుచూపులు…

పట్టిచ్చినవారికి పదిలక్షలు..
అర్ధనగ్నంగా నటిస్తే తప్పా...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *