పెళ్లి చేసి చూడు…ఇళ్లు కట్టి చూడు

పెళ్లి చేసి చూడు…ఇళ్లు కట్టి చూడు అని మన పూర్వీకులు ఊరికేం అనలేదు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరి ఆశయం. అసలు సొంతిళ్లు కొనుక్కోవాలన్నా, కట్టుకుకోవాలన్న కొన్ని నియమాలు నిబంధనలు పాటించాకపోతే జరిగే ముప్పు ఎప్పటికీ పూడ్చలేనిది. ఎందుకంటే జీవితాంతం సంపాదించిన సొమ్ముతోనే మనం ఇంటికి ఇన్వెస్ట్ చేస్తాం. ఇది ప్రతి సామాన్యుడు చేసే పనే. అయితే ఈ ఇంటి విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఇప్పటికే మీకు అర్ధమవుతుంది.

ఇళ్లు కొనాలన్న నిర్ణయానికి రాగానే చాలామంది ముందుగా ప్రాథమిక అంశాలపై ద్రుష్టి పెట్టకుండా…మనకు తారసపడ్డ ఇంటినల్లా చూస్తుంటాము. అది నచ్చకపోతే వేరే అనుకూల పరిస్థితులు వెతుక్కుంటాము. ఈ ప్రోసెస్ లో మనకు తెలియకుండానే చాలా సమయం వ్రుధా అవుతుంది. అసలు ఇళ్లు కొనాలనుకున్న వారు ముందుగా ఇవి సరిచూసుకోండి. మీకు ఏ ప్రాంతలో ఇళ్లు కావాలి?. దాని యొక్క విస్తీర్ణంతో పాటు కావాల్సిన పడక గదులు, టెర్రస్, ఇలా ప్రతీ దానిపై ఓ అవగహన పెంచుకోండి.

 బడ్జెట్ సంగతేంటంటారా…! ఎప్పుడైనా ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ముందుగా మధ్యవర్తిని కలవడం మర్చిపోండి. మనకు తెలియకుండానే మధ్యవర్తికి ఇళ్లుకు అయ్యే మోత్తంలో 30పర్సెంటేజ్ మధ్యవర్తికే కట్టబెడతాం.

వడ్డీ ఎంత?- ఫ్లాటుపై ఓ స్పష్టత వచ్చినాకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంకు రుణంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని బ్యాంకులు పలు నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఉంటాయి. ఈ క్రమంలో దాదాపుగా చూస్తే ఒక్కో బ్యాంకు 10ప్రాజెక్టులతో ముడిపెట్టుకుంది. ఈ తరహా ప్రాజెక్టులు కొంటే బ్యాంకు రుణం మంజూరు విషయంలో  ఇక్కట్లు పడనవసరం లేదు.

బిల్డర్ చరిత్ర?- మన సొంతింటి కల మన చేతుల్లో ఎంత ఉందో అదే లెక్కన బిల్డర్ చేతిలో కూడా ఉన్నట్లు మరవద్దు. ముందుగా బిల్డర్ గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల గూర్చి తెలుసుకోవాలి. కట్టిన ప్రాజెక్టుల విషయంలో ఏమైనా చట్టపరమైన లొసుగులు ఉన్నాయా లేదా అన్నదానిపై ఆరా తీయాలి. మీకు ముందుగా ప్రాజెక్టు గూర్చి చెప్పిన విషయాలు ఆయా ప్రాజెక్టుల్లో ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోండి. ఇక కార్ఫస్ ఫండ్ పై వడ్డీ చెల్లించాడా? అనే విషయాలపై ఓ నివేదిక తయారు చేసుకుని అప్పుడే ఆ బిల్డర్ మీకు సరితూగుతాడా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుని మీ చిరకాల కోరిక అయిన సొంతింటి కలను సాకారం చేసుకోండి. మీకు మంచి మంచి ప్రాజెక్టులు, నమ్మకమైన నిర్మాణ సంస్థలకై మేము అందిస్తున్నాం ntv real estate guru ప్రతి ఆదివారం ఉదయం 10:30 నిమిషాలకు NTV ఛానెల్ లో ప్రసారం అవతుంది. తప్పక చూడండి. మీ రియల్ ఎస్టేట్ గురూ!

టీటీడీ ఛైర్మన్ గా రవి శంకర్..!
సెప్టెంబర్ 11 వ తేదీ పంచంగం...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *