జియో మరో బంపరాఫర్‌..

ఎయిర్‌టెల్‌ లాంటి పెద్ద సంస్థకి కూడా చెమటలు పట్టించిన రిలయన్స్‌ జియో మరో బంపరాఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా  జియో ప్రైమ్‌ కస్టమర్లు 399 రూపాయలు అంతకు మించిన ప్రతి రీచార్జ్‌పై త్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ కింద 2,599 రూపాయల వరకు ప్రయోజనాన్ని పొందే అవకాశమిచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా 399 రూపాయలు అంతకు మించిన ప్రతి రీచార్జ్‌పై రూ.50 విలువైన 400 రూపాయల జియో ఓచర్లను అందించనుంది. ఇవి మైజియోలో వెంటనే అందుబాటులోకి వస్తాయి. నవంబరు 15వ తేదీ నుంచి వీటిని వాడుకోవచ్చు. జియోతో భాగస్వామ్యం కలిగిన వాలెట్ల (అమెజాన్‌పే, యాక్సిస్‌పే, ఫీచార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, ఫోన్‌పే) ద్వారా రీచార్జ్‌ చేసుకుంటే 300 రూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇది వినియోగదారు వాలెట్‌లో జమవుతుంది. ఇకామర్స్‌ సంస్థ భాగస్వామ్యంతో ప్రత్యేక వోచర్లను జియో అందిస్తోంది. ఎజియో వోచర్‌ ద్వారా కస్టమర్లు ఎజియో.కామ్‌లో 1500 రూపాయల విలువైన కొనుగోళ్లు జరిపితే 399 రూపాయల తగ్గింపు లభిస్తుంది. యాత్రా.కామ్‌ ద్వారా దేశీయంగా ఆల్‌ రౌండ్‌ ట్రిప్‌ టికెట్లను బుక్‌ చేసుకుంటే 1,000 రూపాయల డిస్కౌంట్‌ లభించనుంది. వన్‌వే టికెట్‌పై 500 రూపాయల డిస్కౌంట్‌ లభిస్తుంది. రిలయన్స్‌ ట్రెండ్స్‌.కామ్‌లో 1,999 రూపాయలు అంతకు మించిన కొనుగోళ్లపై 500 రూపాయల తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుందట. ఇ-కామర్స్‌ వోచర్లు నవంబరు 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి మరి… జియో ప్రైమ్‌ సభ్యులకు ప్రయోజనం కలిగించే ఈ ప్రత్యేక ఆఫర్‌ ఈ నెల 25వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం త్వరగా రీఛార్జ్‌ చేసేసుకోండి మరి…
న‌వంబ‌ర్ 19న జవాన్ ప్రీ రిలీజ్...
యనమలకు బాబు చెక్ పెట్టడం ఖాయమేనా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *