ట్విట్టర్.. రైల్వేలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం

భారతదేశంలో రైల్వే పెద్ద రావాణా వ్యవస్థ. రోజుకు కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఎక్కడ ఏ సమస్య ఎవరికి ఎదురవుతుందో చెప్పలేం. ఏ ప్రయాణికుడికి ఏ ఇబ్బంది కలుగుతుందో గుర్తించి, పరిష్కరించడం కష్టం. అందుకోసం రైల్వే శాఖ ఒక ట్విట్టర్ ను ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ ట్విట్టర్ లో నేరుగా రైల్వే మంత్రికి ట్వీట్ చేయొచ్చు. వెంటనే అంటే 24 గంటల లోపే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే శాఖ ఇటీవలే ఈ ట్విట్టర్ ను తీసుకొచ్చింది. ధిల్లీలో దీనికి సంబంధించిన ఓ కార్యాలయాన్ని తెరిచింది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే వారికి సమాచారం అందుతుంది. వాళ్లు నిముషాల మీద సంబంధిత డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. దాంతో సమస్య పరిష్కారం అవుతుంది. దీనికై ఒక వ్యవస్థనే పనిచేస్తుంది.  
ఈ ట్విట్టర్ ను ప్రతి స్మార్ట్ ఫోన్లోను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే ఓపెన్ చేసి, దానిలో రైల్వే మినిస్టర్ అని టైప్ చేస్తే మంత్రి పీయూష్ గోయల్ బొమ్మ కనిపిస్తుంది. వారి వారి ప్రాంతీయ భాషల్లో సమస్యను ట్వీట్ చేయొచ్చు. సెకన్లలోనే మీరు చేసిన ట్వీట్ సంబంధిత అధికారులకు పంపుతారు. ఈ మధ్య విజయవాడలో ఇలాంటి ట్వీట్ల ద్వారానే రెండు సమస్యలు పరిష్కారం అయ్యాయి. మొత్తానికి స్మార్ట్ ఫోన్ ద్వారా రైల్వే ప్రయాణికుల సమస్యలు పరిష్కరించడం పై ఆనందిస్తున్నారు ప్రయాణికులు.
50 ఏళ్లలో 20 ఏళ్ల యవ్వనం
ట్రంప్ ఆసియా పర్యటన అందుకేనా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *