టీమిండియా బౌల‌ర్ ష‌మీకి మ‌రో మ‌హిళ‌తో ఎఫైర్‌!

మ‌హ్మ‌ద్ ష‌మీ… టీమిండియాలో స్థిర‌మైన స్థానం సంపాదించ‌డం కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న ఫాస్ట్ బౌల‌ర్‌. దాదాపు 140 కి.మీ.ల వేగంతో బంతులు వేసే ఈ సీమ‌ర్‌, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. త‌న భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుని, త‌న‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వేధిస్తున్నాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ష‌మీ భార్య హాసిన్ జ‌హాన్‌. ఇప్పుడీ వార్త దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

మ‌హ్మ‌ద్ ష‌మీ, టీమిండియాలోకి వ‌స్తూనే సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చేశాడు. ఆరంగ్రేటం చేసిన మొద‌టి వ‌న్డేలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మెడిన్లు వేసి, రికార్డు సృష్టించాడు. ఆ త‌ర్వాత వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి, అద్భుత‌మైన ఎంట్రీ ఇచ్చాడు. రివ‌ర్స్ స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్క‌లు చూపించే ఈ ఉత్త‌ర ప్ర‌దేశ్ కుర్రాడు, భార్య‌కి కూడా చుక్క‌లు చూపిస్తున్నాడ‌ట‌. మ‌హ్మ‌ద్ ష‌మీ, అత‌ని కుటుంబ స‌భ్యులు త‌న‌ను రెండేళ్లుగా వేధిస్తున్నారంటూ, వాళ్లు త‌న‌ను చంపేందుకు కూడా ప్ర‌యత్నించారంటూ అత‌ని భార్య హాసిన్ జ‌హాన్ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన త‌ర్వాత మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేదనీ, త‌న‌కు వేరే అమ్మాయితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది హాసిన్‌.

మ‌హ్మ‌ద్ ష‌మీపై, అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చర్య‌లు తీసుకునేందుకు, కోర్టును ఆశ్ర‌యించ‌బోతున్న‌ట్టు హాసిన్ జ‌హాన్ చెప్పింది. గ‌త జ‌న‌వ‌రిలో లోక‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదుకు ప్ర‌య‌త్నించి, త‌ర్వాత విర‌మించుకున్నానని ఇప్పుడు కోర్టుకు వెళ్ల‌డం ప‌క్కా అని చెప్పింది. వేరే అమ్మాయితో ష‌మీ చేసిన చాటింగ్‌ను స్కీన్ షాట్ తీసి పోస్టు చేసింది హాసిన్‌. వీరిద్ద‌రికీ 2014లో విహ‌హ‌మైంది.  హాసిన్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మ‌హ్మ‌ద్ ష‌మీ స్పందించాడు. ఇదంతా తానంటే గిట్ట‌ని వాళ్లు చేస్తున్న కుట్ర అని కొట్టిపారేసాడు. త‌న‌పై, త‌న భార్య‌పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని వాటిని పట్టించుకోవ‌ద్ద‌ని ట్వీట్ చేశాడు ష‌మీ. టీమిండియాలో నాకు చోటు ద‌క్క‌డం ఇష్టం లేని వాళ్లు, నేనంటే గిట్ట‌ని వాళ్లే ఇదంతా చేస్తున్నార‌నీ ష‌మీ ఆరోపించాడు. మంచి బౌల‌ర్‌గా పేరు గాంచిన న‌న్ను, నా ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు, క్రికెట్‌లో కొన‌సాగ‌నీయ‌కుండా చేసేందుకు ఎవ‌రో కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ, వాళ్ల వ‌ల్ల కాక‌పోవ‌డంతో ఇలా దిగ‌జారుడు ప‌నులు చేస్తున్నార‌ని షమీ ట్వీట్ చేశాడు. అయితే ఆశ్చ‌ర్య‌కరంగా ష‌మీ ట్వీట్ చేసిన కొద్ది సేప‌టికే, ఆయ‌న భార్య హాసిన్ జాహాన్ ఆరోప‌ణ‌లు చేసిన ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ డియాక్టివేట్ అయ్యింది. దీంతో ఆమె నిజంగానే ఆరోఫ‌ణ‌లు చేస్తూ ఆ పోస్టు చేసిందా?  లేక ఎవ‌రైనా ఆమె పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయ‌డం గానీ, లేదా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేయ‌డం గానీ చేశారా? అని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. హాసిన్ మీడియా ముందుకు వ‌స్తే గానీ అస‌లు విష‌యాలు తెలియ‌వు.

అక్కడ వీరిద్దరి కలయిక అందుకేనా?
థియేట‌ర్లు తెరుచుకుంటున్నాయ్‌...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *