నో థ‌ర్డ్ ఫ్రంట్‌.. ఇట్స్ ఫ‌స్ట్ ఫ్రంట్‌!

దేశ రాజకీయాలపై చర్చలు జరుగుతున్నాయి. తెర ముందు రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కనిపించినా తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం సెంట్రల్ లెవెల్లో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అయన కుండబద్దలు కొట్టినట్లు…కాంగ్రెస్, భాజాపా మాత్రమే దేశాన్ని పరిపాలిస్తాయా మరే పార్టీ జాతీయంగా పరిపాలించవద్దా అంటూ ఉప్పెనలా లేచిన కేసీఆర్ తన థర్డ్ ఫ్రంట్ గూర్చి సభాముఖంగా వెల్లడించారు. అయితే దీనిపై రాష్ట్రస్థాయిలో ఏమాత్రం మాటైనా వినిపించట్లేదు. కానీ నేడు కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ స్పందించారు. తన మార్క్ ను మరోసారి బయటపెట్టాడు.

పనితో తానేంటో నిరూపించుకునే కాన్సెప్టుతో కేటీఆర్ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణకు మంత్రి కావచ్చేమో కానీ అంతర్జాతీయంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ స్థాయి ప్రతినిధులు కూడా ఆయన ప్రసంగానికి ఆకర్షితులవుతారు. అయితే మంత్రి కేటీఆర్ తండ్రి ప్రకటించిన థర్డ్ ఫ్రంట్ పై మాట్లాడారు. లేదు లేదు మాది థర్డ్ ఫ్రంట్ కాదని, ఫస్ట్ ఫ్రంట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 2019ఎన్నికల్లో కనీస మెజార్టీ కూడా కరువౌతుందంటూ జోస్యం చెప్పారు. ఇక భాజాపాతో మిత్రపక్షంగా ఉండే ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటి బయటకు వస్తాయంటూ పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఏదైతేనేం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటే ఈ సారేమో లేదు ఫస్ట్ ఫ్రంట్ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి.

పౌరవిమానయాన శాఖ కొత్త మంత్రి
స్థాయి తగ్గించుకోవడమే అంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *