బ‌లిసినోడు బ‌లుస్తున్నాడు.. పేదోడు…

దేశంలో ఆదాయ అస‌మాన‌త‌లు పెరిగిపోతున్నాయ‌ని మేధావులు, ఆర్థిక నిపుణులు ఎంత మొత్తుకున్నా వినే పాల‌కుడే క‌నిపించ‌డం లేకపోవడం . ఫ‌లితంగా పేదోడు ఇంకా నిరుపేద‌గా మారుతున్నాడు.. బ‌లిసినోడు మాత్రం ఇంకా కుబేరుడుగా అవ‌తారం ఎత్తుతున్నాడు.  ఓక్స్ ఫామ్  అనే సంస్థ చేప‌ట్టిన అధ్య‌యనంలో తేలింది. దేశ సంప‌ద‌లో 15 శాతం వేళ్ల‌మీద లెక్క‌పెట్ట‌గ‌లిగే వారి వ‌ద్దే ఉంద‌ని పేర్కొంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు, గ‌తంలో ధ‌నికులైన వారి వ‌ద్దే అధిక సంప‌ద పోగై ఉంద‌ని ఎత్తి చూపింది. ముఖ్యంగా 91 ఆర్థిక స‌వ‌ర‌ణ‌ల త‌ర్వాత ఈ అస‌మాన‌తలు పెరుగ‌తూ వ‌చ్చాయ‌ని అవి ఆరోగ్య‌క‌రంగా లేక‌పోవ‌డంతో మ‌రో విప్ల‌వం వ‌చ్చే స్థాయిలో అస‌మాన‌తులు విజృంభిస్తున్నాయి. తాజా అధ్య‌యంన ప్ర‌కారం.. దేశంలో ధ‌న‌వంతుల కాదు కాదు.. కుబేరుల మొత్తం సంప‌ద జీడీపీలో 15 శాతానికి స‌మానం అయిదేల్ల కింద‌ట ఇది 10 శాతం మాత్ర‌మే న‌ట‌.
101 మంది బిలియ‌నీర్లు ( రూ.6500 కోట్ల‌కు పైగా సంప‌ద ఉన్న‌వారు) 2017నాటికే ఉన్నార‌ట‌ని పేర్కొంది.  మ‌న దేశంలో ఆధాయం, వినిమ‌యం, వినియోగం, పంపిణీ ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో పోల్చితే అత్యంత దారుణంగా ఉన్నాయ‌ని వెల్లించింది.  ఇప్ప‌టికే కులం, మ‌తం, ప్రాంతం, లింగ బేధాల‌తో ఇబ్బంది ప‌డుతున్న దేశం కొత్త‌గా ఆదాయ అస‌మాన‌త‌లో స‌రికొత్త ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని వివ‌రించిందీ ఆ అధ్య‌య‌నం. దీనికంత‌టికీ త్వ‌ర‌గా ప్ర‌భుత్వం మేల్కొని ఎక్క‌డ సంప‌ద పోగ‌వుతుందో… అక్క‌డ ప‌న్నులు వేయాల‌ని స‌లహా ఇచ్చింది. మ‌న ప్ర‌భుత్వాలు మాత్రం ఎక్క‌డ క‌ష్ట జీవులు, నిరుపేద‌లు ఉన్నారో అక్క‌డే ప‌న్నులు వేస్తున్నారు. ఇందుకు నిన్న‌టి కేంద్ర బ‌డ్జెటే ఉదాహార‌ణ. పిల్ల‌లు వాడే పుస్త‌కాలు, పెన్సిళ్ల‌పై ప‌న్నులు వేసి  సంప‌న్నుకు మాత్రం విచ్చ‌ల‌విడిగారుణాలు, రుణ వ‌డ్డీ రాయితీలు ఇస్తున్నారు.
రైతులకు కేసిఆర్ శుభవార్త...
మోదీజీ.. అవినీతి ఏమీ మార‌లేదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *