బ్యాక్టీరియా థెరపీతో కేన్సర్‌కు అడ్డుకట్ట

కేన్సర్‌ను వ్యాపింపచేసే కణాలను చంపే శక్తి బ్యాక్టీరియాకు ఉందా? అంటే అవుననే అంటున్నారు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు. ఈ మేరకు పలురకాల కేన్సర్లపై తాము నిర్వహించిన క్లినికల్‌ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఐఐఎస్సీ చెందిన బయోకెమిస్ట్రీ విభాగం, అంటువ్యాధుల పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం మైక్రో బ్యాక్టీరియం ఇండికస్‌ ప్రాణి అనే బ్యాక్టీరియాపై సుదీర్ఘకాలం పరిశోధనలు చేసింది. ఈ బ్యాక్టీరియాకు కేన్సర్‌పై సమర్థవంతంగా పోరాడే శక్తి ఉన్నట్లు గుర్తించామని బృందానికి నాయకత్వం వహించిన ప్రొ.దీపంకర్‌ నంది వెల్లడించారు. కేన్సర్‌ బాధితుల శరీరంలోకి ఈ బ్యాక్టీరియాను పంపిన వెంటనే కేన్సర్‌ కణాలు చచ్చుబడిపోయాయని చెప్పారు. కాగా, ఈ బ్యాక్టీరియాను గతంలో ఢిల్లీకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ కేంద్రానికి చెందిన ప్రొ.గురుకరణ్‌ ప్రాణ్‌ తల్వార్‌ వృద్ధి చేశారని తెలిపారు. ఈ బ్యాక్టీరియాలను ప్రయోగాత్మకంగా క్లినికల్‌ దశలో వినియోగిస్తున్నామని చెప్పారు. కేన్సర్‌ బాధితులకు కీమోథెరపీతోపాటు బ్యాక్టీరియా థెరపీ ఇవ్వడం ద్వారా రోగి త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు ఆయ‌న సిద్ధం..!
బుల్లి వైద్య పరికరాలకోసం మెత్తని గాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *