నా బాడీ.. నాఇష్టం.. మీకెందుకు?

నా బాడీ నాఇష్టం మీకెందుకని ప్రశ్నిస్తుంది రాధిక ఆప్టే. అవును రాధికాకు ఇదేమీ కొత్త కాదు. ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో ఆమె న్యూడ్ గా నటించిన చిత్రాలపై స్పందన కూడా ఇలానే ఉంది. సినిమాని సినిమాలా చూడాలంటూ అంతేకాని బట్టలు వేసుకుందా లేదా అనేవి ఎందుకంటూ నెటిజన్లపై తీవ్రంగా విరుచుకుపడ్డ సందర్భాలూ లేకపోలేదు. అయితే తాజాగా ఈ సొగసరి తన భర్త బెనడిక్ట్ టేలర్ తో కలిసి గోవా వెళ్లారు. ఈ నేపథ్యంలో బీచ్ లో రొమాన్స్ తో కూడిన సందడి చేశారు. అయితే ఈ సందడిలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఆమె ధరించిన దుస్తులే. అవును గోవా బీచ్ లో భర్తతో రాధిక ఆప్టే బికినీ అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగానే ఉంది. దీనిపై రాధిక ఆప్టే స్పందించింది.

* తన బికినీపై నెటిజన్ల కామెంట్లపై రాధిక ఆప్టే ఫైర్ అయింది. తన బికినీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయినా బీచ్ లో బికినీ వేయకపోతే…చీర కట్టుకుని బీచ్ లో సందడి చేయమంటరా అంటూ ఎదురు ప్రశ్నించింది. నేనే బీచ్ లో బికినీ వేస్తా లేదా ఇంకేమైనా చేస్తా అది నా పర్సనల్ మీకేంటంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

''ఉద్య‌మ స్ఫూర్తి'' అంటే కేసీఆర్‌కు భ‌య‌మెందుకు?
హరిష్ రావు ప్రచారం వెనుక ఎవరున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *