అంత‌వర‌కూ రాఘ‌వేంద్ర‌రావు ఎదురుచూడాలా..?

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు అంటే ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ, ఈ మ‌ధ్య ఆయ‌న పేరు వింటే భ‌క్తిర‌స చిత్రాలే క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే, అన్న‌మ‌య్య త‌రువాత ఆయ‌న పంథా పూర్తిగా మార్చేశారు. కేవ‌లం భ‌క్తిర‌స ప్ర‌ధాన చిత్రాల‌కే ప‌రిమిత‌మౌతూ వ‌స్తున్నారు. చివ‌రిగా ఆయ‌న ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న తీసిన భ‌క్తి ర‌స ప్ర‌ధాన చిత్రాల్లో ఎక్కువ‌గా నాగార్జున మాత్ర‌మే హీరోగా నటిస్తూ వ‌చ్చారు. అయితే, ఫ‌ర్ ఎ ఛేంజ్‌.. వెంక‌టేష్ తో ఒక భ‌క్తి ర‌స ప్ర‌ధాన చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. నిజానికి, ఈ కాంబినేష‌న్ గురించి ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఎందుకో కార్య‌రూపం దాల్చలేదు. దీంతో వెంకీ వేరే చిత్రాల‌తో బిజీ అయిపోయారు.
అయితే, ప్ర‌స్తుతం వెంక‌టేష్ కోస‌మే రాఘ‌వేంద్రుడు ఒక క‌థ‌ను సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్ కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాలో సునీల్ కూడా ఒక ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతున్నార‌ని అంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ద‌రిదాపుల్లో సెట్స్ మీదికి వ‌చ్చే ప‌రిస్థితిలు క‌నుచూపు మేర‌ల్లో లేవు. ఎందుకంటే, హీరో వెంక‌టేష్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు తేజ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ త‌రువాత‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ న‌టిస్తారు. అంటే, ద‌ర్శ‌కేంద్రుడితో వెంకీ కాంబినేష‌న్ సెట్ కావాలంటే రెండు సినిమాలు పూర్తి కావాలి. ఈలోగా స‌మీక‌ర‌ణ‌లు ఎన్ని మారుతాయో ఏమో..! మ‌రి, అంత‌వ‌ర‌కూ ద‌ర్శ‌కేంద్రుడు ఎదురుచూస్తారా..?
క‌ర్ణాట‌క‌లో కూడా భాజ‌పాకి తెలుగువారి టెన్ష‌న్‌..!
ఆశావ‌హుల‌ను అలా బుజ్జ‌గించాల్సి వ‌స్తోంద‌న్న‌మాట‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *