ల‌గ్జ‌రీ విల్లాలకే స‌రికొత్త చిరునామా

విప్లవాత్మకమైన నిర్ణయాలు.. వినూత్నమైన ఆలోచనలు..  ఆకర్షణీయమైన డిజైన్లు..  ప్రపంచ స్థాయి సదుపాయాలు.. సకాలంలో ఫ్లాట్లను డెలివరీ చేయగల సత్తా ఉన్న సంస్థ.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రగామి అయిన.. రాజపుష్ప ప్రాపర్టీస్..

తెలంగాణ నిర్మాణ రంగంలో లీడర్గా అవతరించాలన్న బృహత్ లక్ష్యాన్ని రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్దేశించుకుంది. అందుకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఏకకాలంలో మూడు విభిన్న ప్రాజెక్టులను ఆవిష్కరించింది. తన సత్తాను మరోసారి చాటి చెప్పింది. ప్రపంచ స్థాయి సదుపాయాలను, సకాలంలో కొనుగోలుదారులకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో.. ఈ మూడు ప్రాజెక్టులను ఆవిష్కరించింది. ఇంతవరకూ హైదరాబాద్ నిర్మాణ రంగంలో యాభై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసిన రాజపుష్ప ప్రాపర్టీస్.. రానున్న రోజుల్లో సుమారు ఎనభై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేయాలన్న లక్ష్యంతో దూసుకెళుతున్నది. ఇప్పటికే ఎనిమిది వేల ఎనిమిది వందల హ్యాపీ కస్టమర్లున్న ఈ సంస్థ.. మరి కొంతమంది కస్టమర్లను తమ ఖాతాలో చేర్చుకోనున్నది. ప్రస్తుతం దాదాపు ముప్పయ్ లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రారంభించిన కొత్త ప్రాజెక్టుల బ్రోచర్లను భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆవిష్కరించింది. తనకు రాజపుష్ప ప్రాపర్టీస్తో గల అనుబంధాన్ని పీవీ సింధు ఎంతో హుందాగా ప్రపంచం ముందు వెల్లడించింది.

తెల్లాపూర్లో దాదాపు 42 ఎకరాల్లో.. అందమైన 262 విల్లాల ప్రాజెక్టు అయిన రాజపుష్ప గ్రీన్డేల్కు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో సరికొత్త జీవితాన్ని ఆవిష్కరించాలని ఆశించేవారి కోసం రాజపుష్ప ప్రాపర్టీస్.. రాజపుష్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 265 విల్లాలను నిర్మిస్తున్నారు. కేవలం గ్రీన్ స్పేసెస్ కోసమే నాలుగున్న ఎకరాలను కేటాయించింది. ఒక్కో విల్లా సైజును 330, 400, 450 గజాల్లో నిర్మిస్తోంది. తెల్లాపూర్ వంటి ప్రశాంతమైన వాతావరణంలో.. విల్లా లైఫ్స్టయిల్కే సరికొత్త భాష్యం చెప్పేలా రాజపుష్ప గ్రీన్డేల్ను డిజైన్ చేసింది. ఇందులో నివసించేవారు ప్రతి సందర్భాన్ని, ప్రతి రోజును ఆస్వాదిస్తారు. ముప్పయ్ ఐదు వేల చదరపు అడుగుల్లో జి+1 అంతస్తులో నిర్మించే క్లబ్ హౌజ్ ప్రాజెక్టుకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిన్నారులకు పూల్తో బాటు స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, హెల్త్ క్లబ్.. ఇలా అనేక అమెనిటీస్ను పొందుపరిచింది. మరి, ఈ ప్రాజెక్టు హైలెట్స్ ఒకసారి చూద్దామా..
* లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్
* వంద శాతం వాస్తు
* గేటెడ్ కమ్యూనిటీ విత్ సోలార్ ఫెన్సింగ్
* హై ఎండ్ క్లబ్ హౌజ్
* చిన్నారులకు ప్లేఏరియా, ఆక్టివిటీ జోన్
* జాగింగ్, వాకింగ్ ట్రెయిల్
* డిజైనర్ ల్యాండ్ స్కేప్స్, వాటర్ స్కేప్స్

`ప‌డిపోయా నీ మాయ‌లో`
ఏవీ హైమా రెసిడెన్సీ @ తార్నాకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *