ఆశావ‌హుల‌ను అలా బుజ్జ‌గించాల్సి వ‌స్తోంద‌న్న‌మాట‌..!

ప‌ద‌వులు పందేరం అన‌గానే పార్టీని న‌మ్ముకున్న వారిలో చాలామందికి ఆశ‌లు పుట్టుకొచ్చేస్తాయి. ప‌ద‌వుల్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎవ‌రి స్థాయిలో వారు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. తాజాగా ముగిసిన రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ కూడా ఇదే. ఆంధ్రాలో టీడీపీకి వ‌చ్చిన రాజ్య‌స‌భ స్థానాలు రెండంటే రెండే. ఆ రెంటి కోసం ఎంతోమంది పోటీలు ప‌డ్డారు. ఎవ‌రి స్థాయిలో వారు ప్ర‌య‌త్నాలు చేశారు. అంతేకాదు, ఏకంగా తెలంగాణకు చెందిన కొంత‌మంది టీడీపీ నేత‌లూ, పారిశ్రామికవేత్త‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నించారు. అయితే, చిట్ట చివ‌రికి చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు మరోలా ఉన్నాయి. సీఎం ర‌మేష్ కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. అలాగే, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్ కు అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న టీడీపీకి 1998 నుంచి న్యాయ‌సేవ‌లు అందిస్తున్నారు. స‌రే.. వారు పేర్లు ఖ‌రారు కాగానే ఆశావ‌హులుల్లో అసంతృప్తి ర‌గ‌ల‌డం అనేది అత్యంత రొటీన్. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది ఇదే.
ఈ అసంతృప్తుల‌ను ప్ర‌స్తుతానికి సంతృప్తిప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే, త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు రాబోతున్నాయి. కాబ‌ట్టి, ఇలాంటి స‌మ‌యంలో నాయ‌కుల్ని బుజ్జ‌గించుకోవాల్సిందే..! ప్ర‌స్తుతం ఏపీలో చాలామంది నేత‌ల‌ను టీడీపీ రాష్ట్ర స్థాయి నేత‌ల నుంచి ఓదార్పు యాత్ర‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. కొంత‌మంది ఆశావ‌హుల‌తో నేరుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే మాట్లాడాల్సిన ప‌రిస్థితి కూడా వ‌స్తోంద‌ని స‌మాచారం. ఇదే క్ర‌మంలో బీద మ‌స్తార్ రావు, బీద ర‌వీంద్ర‌లు ముఖ్య‌మంత్రిని క‌లుసుకున్నారు. వీరిలో మ‌స్తాన్ రావు రాజ్య‌స‌భ సీటు కోసం బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, రాలేదు. దీంతో ఆయ‌న‌కి అసంతృప్తి క‌లుగకుండా చంద్ర‌బాబు చెప్పిన హిత వచ‌నాలు బాగానే ఉన్నాయి.
ప్ర‌త్యేక్ష ఎన్నిక‌ల్లో నేరుగా గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కులు రాజ్య‌స‌భ సీటు కోసం ఎదురుచూడాల్సిన అవ‌సరం లేద‌న్నారు. కావ‌లి నియోజ‌క వ‌ర్గంలో బీద మ‌స్తాన్ సోద‌రులు బ‌లంగా ఉన్నార‌నీ, ఆయ‌న్ని రాజ్య‌స‌భ‌కు పంపిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టిక్కెట్ ఎవ‌రికి ఇవ్వాల‌నీ, బ‌ల‌మైన నేత‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తార‌ని చంద్ర‌బాబు అన్నార‌ట‌. మీలాంటి వారిని ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరం చేస్తే, కొత్త‌వారిని వెతుక్కోవ‌డం క‌ష్ట‌మౌతుంద‌నీ, పైగా ప్ర‌తిప‌క్షాల‌కు అడ‌గ‌కుండానే అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నీ, పార్టీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను పెంచి పోషించిన‌ట్టు అవుతుంద‌ని చంద్ర‌బాబు బుజ్జ‌గించార‌ట‌. భలేగా చెప్పారు క‌దా..!
అంత‌వర‌కూ రాఘ‌వేంద్ర‌రావు ఎదురుచూడాలా..?
సీఎం చంద్ర‌బాబు మాట‌ల్లో ద‌క్షిణాది భావన..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *