రామ్ చ‌ర‌ణే ఆల‌స్యం చేస్తున్నాడా…?

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా భారీ అంచ‌నాల‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి పుణ్య‌మాని రెండో సినిమాతోనే  ఇండ‌స్ట్రీ హిట్ అందుకుని స్టార్ హీరోగానూ మారాడు. అయితే ఆ త‌ర్వాత తీసిన ‘ఆరెంజ్‌’ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యి, అత‌ని బాబాయ్ ఆర్థికంగా కుంగిపోవ‌డానికి కార‌ణ‌మైంది. ఆ ప‌రాజ‌యం త‌ర్వాత వ‌రుస‌గా మాస్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్ ‘మెగాప‌వ‌ర్‌స్టార్‌’గా ఎదిగాడు. అయితే న‌టుడిగా అత‌నికి ప‌డిన మార్కులు అర‌కొరే. ముఖంలో స‌రిగా హావ‌భావాలు ప‌లికించ‌లేడ‌ని, డైరెక్ట‌ర్ల మాట విన‌డ‌ని చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి చ‌ర‌ణ్ మీద‌. 

బ‌య‌ట సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటాడు… మంచి మ‌న‌సున్న వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌చ్చే స‌రికి స‌రిగా మాట విన‌డ‌నే అప‌వాదు ఉంది. ఆ మ‌ధ్య సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ కూడా ‘ఒక స్టార్ హీరో చిన్న డైలాగులు చెప్ప‌డానికే ప‌ది, ప‌దిహేను టేకులు తీసుకుంటాడ‌ని, చెప్పేది కూడా స‌రిగా విన‌డ‌ని’ కామెంట్ వేశాడు. డైరెక్టుగా రామ్‌చ‌ర‌ణ్ అని చెప్ప‌క‌పోయినా, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్టార్‌ హీరోల‌ను గ‌మ‌నిస్తే, చ‌ర‌ణ్ గురించేన‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌హేష్‌తో ‘మురారి’, ఎన్‌టీఆర్‌తో ‘రాఖీ’, ప్ర‌భాస్‌తో ‘చ‌క్రం’ సినిమాలు రూపొందించాడు రామ్‌చ‌ర‌ణ్‌. వీళ్లంద‌రూ వ‌ర్క్ విష‌యంలో ఎంత డెడికేటెడ్‌గా ఉంటారో తెలిసిందే. న‌ట‌న‌లో ఈ ముగ్గురూ ఎవ‌రికి వారే సాటి. దాంతో ఇన్‌డైరెక్టుగా రామ్‌చ‌ర‌ణ్‌నే అన్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇప్పుడు ‘రంగ‌స్థ‌లం’ ఆల‌స్యానికి కూడా రామ్‌చ‌ర‌ణే కార‌ణ‌మ‌ట‌. ఇప్ప‌టికే సుకుమార్ ఒక్కో సీను, కావ్యంలా చెక్కుతున్నాడ‌ని త్వ‌ర‌గా తీయ‌మ‌ని అభిమానులు చెప్పాలంటూ ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. దీంతో స‌న్నివేశాలు బాగా రావ‌డం కంటే, త్వ‌ర‌గా సినిమా ముగించేందుకే రామ్‌చ‌ర‌ణ్ ఆస‌క్తి చూపిస్తున్నాడంటూ అత‌నిపై కామెంట్లు వ‌చ్చాయి. ఇప్పుడు దాదాపు షూటింగ్ అయిపోయే స‌మ‌యంలో చెప్పాపెట్ట‌కుండా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి, భార్య ఉపాస‌న‌తో క‌లిసి అమెరికా టూర్‌కి వెళ్లాడు రామ్‌చ‌ర‌ణ్‌. సినిమా షూటింగ్ ముగియ‌క ముందే హీరో అమెరికా వెళ్లిపోవ‌డంతో అత‌ని కోసం ఎదురుచూస్తూ, షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు సుక్కు. షూటింగ్ ముగిశాక‌, పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకా విడుద‌లకి నెల రోజుల గ‌డువున్నా, ఎక్క‌డ తేడా కొట్టినా మ‌ళ్లీ ‘రంగ‌స్థ‌లం’ వాయిదా ప‌డ‌డం ప‌క్కా. ఇప్ప‌టికే సంక్రాంతి విడుద‌ల కావల్సిన సినిమా కాస్తా, మూడు నెల‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.
‘రంగ‌స్థ‌లం’ విడుద‌ల కాక‌ముందే రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమాను కూడా ప్రారంభించడం కొస‌మెరుపు.

పైస‌లొచ్చేనా!
నంద‌మూరి వారి ‘మ‌నం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *