వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

001కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ మార్కెట్ మహా పతనం తర్వాతా మరో కీలక నిర్ణయం నేడు వెలువడనుంది. అదే ఆర్బీఐ పరపతి విధానాన్ని ప్రకటించడం. అయితే ఇంత గందరగోళం మధ్య ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అన్నదే నేడు కీలకాంశంగా మారింది. బడ్జెట్ దెబ్బకు ద్రవ్యలోటు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేస్తే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే విషయంపై విశ్లేషకులు ఇలా చెబుతున్నారు… ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయం వల్ల మొత్తం ఎకానమిక్ మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే..ఆర్బీఐ నిర్ణయమే కీలకమని చెబుతున్నారు. గత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వచ్చినప్పుడు అమెరికాలో డాలర్ రూ.69 పలికింది. ఆ సమయంలో రఘరామ్ రాజన్ కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అయితే ఆ నిర్ణయాల వల్ల నిఫ్టీ 5100 లెవల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి డాలర్ 69 నుంచి 57 వరకు తగ్గినట్లు చెప్పారు. ఇదంతా కేవలం ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని చాలా విశ్లేషణాత్మక  అంశాలను వెల్లడించారు.

ముఖ్యంగా గ్రోత్ డిస్ట్రబ్ అవ్వకుండా ఎకానమిక్ రన్ అయ్యేలా ఆర్బీఐ నిర్ణయాలు ఉండేలా చూసుకోవాలి. అయితే గ్రోత్ పాజిటివ్ గా ముందుకెళ్లాలి. ఎప్పుడైతే జీడీపీ గ్రోత్ మంచిగా ఉంటుందో..అప్పుడే ద్రవ్యోల్బణం కూడా పెరగే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ కీలక నిర్ణయాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులపై చూస్తే బీఎస్టీ, డీమోనిటైజేషన్ తర్వాత బీడీపీ స్టెబిలైజేషన్ అయింది.

–      ఆర్థికాభివృద్ధికి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..?

వడ్డీరేట్లను తగ్గించుకుంటేనే దేశానికి లాభదాయకంగా ఉంటుంది. కారణాలు గమనిస్తే అమెరికాలో వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటిస్తున్నారు. వాళ్లు ఇలా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోవడం వలన భారత్ కు అమెరికాకు గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా వడ్డీరేట్లు తగ్గించుకోవడం వల్ల ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్టు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రేట్లను మెయిన్టెన్ చేసుకుంటూ వడ్డీరేట్లు తగ్గించుకుంటూ వెళ్తేనే మంచింది. ఇక్కసారి ఇన్వెస్టర్లను కోల్పోతే మళ్లీ వాళ్లను ఆకర్షించుకోవడం చాలా కష్టమంటున్నారు. ఎక్కువగా ప్రధాని, ఆర్థికశాఖ మంత్రులు విదేశీ పర్యటనలు చేయడానికి ముఖ్యకారణం ఏంటంటే…ఎఫ్డీఐ, ఎఫ్ఐ నిధులు రాబట్టుకోవడానికే. ఇలాంటి నేపథ్యంలో అత్యవసరంగా వడ్డీరేట్లు పెంచితే చాలా నష్టమని చెబుతున్నారు .

గూగుల్ లో కొడితే రాహుల్ పేరు పప్పు..
అబద్దాలతో రాష్ట్రాన్ని అస్థిరపర్చే కుట్ర...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *