యాంటీబయోటిక్స్‌తో కేన్సర్‌ చికిత్సకు ముప్పు

ప్రతి మానవుడికి యాంటీబయోటిక్స్ మీద ఆధారపడటం అలవాటైపోయింది. చిన్ప చిన్న డిసీస్ కి సైతం యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. ప్రతీ డాక్టర్ హై డోసేజ్ మెడిసిన్ ఇవ్వడం… ప్రజలు టాబ్లెట్ అంటే యాంటీబయోటిక్స్ అనే స్థాయికి వాటి వాడకం భారీగా పెరిగిపోయింది. కానీ వాటి వినియోగంతో ప్రమాదం పొంచి ఉందని కొంతమంది సైన్టిస్టులు చెబుతున్నారు… అది ఎలాగో వివరంగా తెలుసుకుందాం….జలుబు, దగ్గు, జ్వరం నుంచి కేన్సర్‌ వరకు ఏ వ్యాధికైనా యాంటీబయోటిక్స్‌ను వైద్యులు సూచిస్తుంటారు. అయితే యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడటం చాలా ప్రమాదకరం అంటున్నారు అమెరికాలోని అగస్టా యూనివర్సిటీ పరిశోధకులు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని తెల్లరక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు వారి పరిశోధనలో తేలింది. దీనిద్వారా రోగ నిరోధకశక్తి తగ్గడంతోపాటు కేన్సర్‌ చికిత్సపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యాంటీబయోటిక్స్ వినియోగం తగ్గాలని కోరుకుందాం….
మ‌న ప్ర‌ముఖ‌ల విమానాల ఖ‌రీదెంతో తెలుసా...
ట్రంప్ ప‌న్నులేస్తే... మ‌న‌కేంటి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *