2019 వరకూ రాష్ట్ర రాజకీయాల్లో

కేసీఆర్ తో రాజ్యసభ అభ్యర్థి సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2019 వరకూ ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 2019 తర్వాత దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనకు చప్పట్లతో ప్రజా ప్రతినిధులు తమ మద్దతు తెలిపారు. మనది థర్డ్‌ ఫ్రంట్‌ కాదని, ఫస్ట్‌ ఫ్రంట్‌ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల తరవాత రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేద్దామని ఆయన చెప్పారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు, కేసీఆర్‌ అప్పగించారు. జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌ సహకరించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలితే సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తామని వెల్లడించారు. సభకు ఎమ్మెల్యేలు విధిగా సమయానికి హాజరు కావాలన్నారు. టీఆర్ఎస్ కోటాలో రాజ్యసభకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం ఎల్పీకి పరిచయం చేసారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్ లు ఇవాళ ఉ. 9 గం.లకు నామినేషన్ దాఖలు చేస్తారు.

ఈ వారం వారఫలాలు...
N Shankar Elected as Director's Union President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *