లైంగిక వేధింపులు ఎదుర్కొన్న స‌మంత డూప్‌!

ప్ర‌ముఖ గాయ‌ని  చిన్మ‌యి, త‌న పాట‌ల‌తో కంటే డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ఏ మాయ చేశావే’ సినిమాలో స‌మంత పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పి, జెస్సీ పాత్ర తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సులో చెగిరిపోకుండా చేసిందీ పాప గొంతే! గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగుతున్న చిన్మ‌యి ఈ మ‌ధ్య లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విష‌యం బ‌య‌ట పెట్టింది. ‘మీ టూ’ పేరిట హీరోయిన్లు టాలీవుడ్‌లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బాహాటంగా మాట్లాడుతున్న స‌మ‌యంలో, ఇప్పుడు చిన్మ‌యి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాన‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే ఆమెను వేధించిన వ్య‌క్తి ఓ సాధార‌ణ ప్రేక్ష‌కుడు కావ‌డం విశేషం.
సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, త‌న విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది చిన్మ‌యి. తాజాగా త‌న‌కి ఎదురైన లైంగిక వేధింపుల గురించి త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘‘ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యాను. అక్క‌డ నా చుట్టూ చాలా మంది చేరారు. ఆ గుంపులో నుంచి ఓ వ్య‌క్తి నన్ను తాక‌రాని చోట తాకాడు. నా లైంగిక అవ‌య‌వాల‌ను తుడిమాడు. నాపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు…’’ అంటూ పోస్టు చేసింది చిన్మ‌యి. అంతేకాకుండా ఆ త‌ర్వాత కూడా స్త్రీలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల స‌మ‌స్య గురించి వ‌రుస ట్వీట్లు చేసింది చిన్మ‌యి. ‘‘టీచ‌ర్లు, సోద‌రులు, అంకుల్స్‌, ఆంటీలూ, తోటి ప్ర‌యాణీకులు… ఇలా ప్ర‌తి ఒక్క‌రూ అమ్మాయిల‌ను లైంగికంగా వేధించేవాళ్లే. అంద‌రి చేతుల్లోనూ బాల‌బాలిక‌లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యం అమ్మాయిలు చెబితే కొంత మంది న‌మ్ముతారు. అబ్బాయిలు చెబితే మాత్రం ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. ఇంకొంద‌రైతే పిల్ల‌లు త‌మ‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌ను ఎంజాయ్ చేస్తార‌ని చెబుతారు. ఇది సిగ్గు చేటు…’’ అని అస‌హనంగా పోస్టు చేసింది చిన్మ‌యి.
తెలుగులో స‌మంత‌కి క్రేజ్ రావ‌డానికి చిన్మ‌యి గొంతు కూడా ఒక కార‌ణం. స‌మంత కూడా చాలా సార్లు త‌న‌కి ఇంత‌టి పేరూ ప్ర‌తిష్ట‌లు రావ‌డానికి, తెర వెన‌క నా డూప్‌లా న‌టించే చిన్మ‌యియే కార‌ణ‌మ‌ని చెప్పింది. నిజానికి త‌న‌కు బ‌దులుగా న‌టించిన‌వారిని డూప్‌లు అంటారు కానీ స‌మంత, త‌న‌కి గొంతు అరువిచ్చిన చిన్మ‌యిని డూప్‌గా గ‌ర్వంగా ప్ర‌క‌టించుకుంది. ‘అలా ఎలా’, ‘అందాల రాక్ష‌సి’ సినిమాల్లో హీరోగా న‌టించిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ను చిన్మ‌యి ప్రేమించి, పెళ్లి చేసుకుంది. స‌మంత పెళ్లికి నేరుగా హాజ‌ర‌యిన అతి కొద్దిమంది అతిథుల్లో వీరిద్ద‌రూ కూడా ఉన్నారు.
కవితకు తెలుగులో మోడీ విషెష్..
ప‌డుకోకుండా ఏ ప‌నీ కాదు.... హీరోయిన్ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *