వరుసపెట్టి ఆఫర్లు కానీ…

తెలుగు పరిశ్రమలో యూత్ ఎక్కువగా ఇష్టపడే కమెడియన్ సునీల్. దశాబ్దకాలంగా చిత్రపరిశ్రమను తన నవ్వులతో అలరించాడు. అయితే కమెడియన్గా ఉన్నప్పుడు సునీల్ ను ఎంతలా ఆదరించారో…తాను హీరోగా టర్న్ అయ్యాకా అదే ఆదరణ కరువైందనే చెప్పొచ్చు. ఇక హీరోయిన్లు కూడా సునీల్ అంటేనే మోహం చాటేస్తున్నారు. అమ్మో సునీలా అంటూ సైడ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆయన హీరోగా చేసినా, ఆయన హావభావాలు, మాట తీరు అంతా గత సునీల్ వైభవాన్నే చూపిస్తుంది. ఈ క్రమంలో సునీల్ తీస్తున్న చిత్రాలు వరుసపెట్టి డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. అయితే సునీల్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. తన తప్పు తెలుసుకుని మళ్లీ తన పాతదారినే ఎంచుకున్నాడు.

రాబోయే సినిమాల్లో సునీల్ కమెడియన్ గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా వివరాలివే…త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్ కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీనువైట్ల-రవితేజ కొత్త సినిమాలోనూ సునీల్ తన పాత పంథానే కనబర్చనున్నాడు. మరో సినిమా వెంకటేష్ సినిమాలోనూ సునీల్ కమెడియన్ గా అలరించనున్నాడు. ఇలా వరుసపెట్టి సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నాడు సునీల్. తన హీరో కెరీర్ ని పక్కనపెడితేనే మళ్లీ ఫాంలోకి రావచ్చని భావించిన ఈ భీమవరం బుల్లోడు కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యాడు.

DANDUPALYAM NEW MOVIE
పౌరవిమానయాన శాఖ కొత్త మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *