ఇల్లు కొన‌లేం.. బండి తీసుకోలేం!

ఏంటి ఇంత మాట అన్నారు.. అనుకుంటున్నారా. ఇప్పుడున్న నిర్మాణ సామ‌గ్రి ధ‌ర‌లు, ఇప్పుడున్న వాహ‌నాల ధ‌ర‌లు చూసి ఎంత‌టి వేత‌న జీవి ఐనా నెట్‌గా డ‌బ్బు క‌ట్టి అదీనూ ఇది వ‌రికంటే అధిక మొత్తంలో చెల్లించే స్తోమ‌త ఉంటేనే మీ క‌ల‌లు నెర‌వేరుతాయి.  ఎందుకంటే.. భార‌తీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు వ్య‌క్తిగ‌త రుణాలు, గృహ‌రుణాలు, వాహ‌న రుణాల‌పై వ‌డ్డీ రేట్లు పెంచాయి. ప్ర‌భుత్వ రంగంలోని బ్యాంకులే ఇలా వ‌డ్డీ రేట్లు పెంచ‌డంతో ఇక ప్రైవేటు రంగ బ్యాంకులు ఎందుకు మాత్రం ఊరుకుంటాయి. అవి వీటికంటే రెండు పైసులు ఎక్కువే పెంచేయోచ‌న‌లో ఉన్నాయి.  
ఇప్ప‌టికే భారీ, చిన్న త‌ర‌హా డిపాజిట‌ర్ల‌పై అంటే ప్ర‌జ‌ల‌కు కూడ‌బెట్టుకుని దాచుకునే సొమ్ముపై వ‌డ్డీ త‌గ్గించిన వ‌చ్చిన బ్యాంకులు ఇప్పుడు మ‌న‌కు ఇచ్చే అప్పుకు మాత్రం వ‌డ్డీ పెంచేస్తున్నారు. అంటే.. ఈ దెబ్బ‌కు బ్యాంకులంటేనే బాబోయ్ అనే ప‌రిస్థితి తెస్తున్నారు. మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు నిర్ణ‌యం ప్ర‌కారం రుణ వ‌డ్డీ రేట్లు  పెంచుతాయి. ఎంసీఎల్ఆర్ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి వ‌డ్డీ రేట్లు పెంచ‌డం ఇదేప్ర‌థ‌మం. ఇంత‌కుముందుకు  ఏడాది వ‌ర‌కు కాల‌ప‌రిమితి ఉన్న రుణాల‌కు ఎస్‌బీఐ 7.95 శాతం వడ్డీ ఉండేది. ఇప్ప‌డు 0.20 శాతం పెంపుతో ఇది కాస్త 8.15 శాతానికి పెరిగింది.
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు 8.15 శాతం నుంచి 8.30కి పెంచారు.ఈ ప్ర‌భావం నెల వారీ వాయిదాలుగా చెల్లింపులు అదేనండీ ఈఎంఐలు చెల్లించే వారినా ప‌డుతుంది.ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తుండ‌టంతో ప్ర‌స్తుతం గృహ రునాల‌పై వ‌డ్డీ రేట్ల గురించి బ్యాంకులు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌చ్చు. ఆ త‌ర్వాత  వ‌డ్డీ రేట్ల‌ను పెంచేందుకు అవ‌కాశాలు ఎక్కువ క‌నిపిస్తున్నాయి. ఎస్‌బీఐ పెంచించి 0.2 శాతం మాత్ర‌మే అనిపించినా.. దీర్ఘ కాలంలో ఉండే గృహ రుణాల‌పై వ‌డ్డీ రేటు 8.35 శాతానికి ఉంటుంది. తాజా పెంపుతో ఇది 8.55 శాతానికి చేరే అవ‌కాశం ఉంది.  డిపాజిటు రేటు ఇది.. రూ.కోటి వ‌ర‌కు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ఎస్‌బీఐ 0.15శాతం పెంచింది. ఇక నుంచి 6.4శాతం వ‌డ్డీ చెల్లించ‌నుంది. ఇది రెండేళ్లు మాత్ర‌మే .ఆ  త‌ర్వాత ప‌దేళ్ల వ‌ర‌కు డిపాజిట్ల వ‌డ్డీ రేటు 0.50 శాంతం పెంచి 6.50 శాతం స‌వ‌రించింది.  అదే పీఎన్‌బీ అన్ని ర‌కాల కాల వ్య‌వ‌ధి డిపాజిట్ల‌పై 45బేసిస్ పాయింట్ల వ‌డ్డీని పెంచింది.
నేటి నుంచి థియేట‌ర్లు బంద్‌!
భ‌ద్రాదిలో భారీ ఎన్‌కౌంట‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *