ఎంట్రీ ట్యాక్సును ఎత్తివేయండి

వాణిజ్య ప‌న్నుల ముఖ్య‌కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌ని
క‌లిసిన తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌
తెలంగాణ బిల్డర్ల సమాఖ్య ఆధ్యర్యంలో తెలంగాణ రాష్ట్రంలో డెవ‌ల‌ప‌ర్లు ఎదుర్కోంటున్న ఎంట్రీ టాక్స్ సమస్యపై వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి. శ్రీ సొమేష్ కుమార్ ని కలిసి తమ సమస్యలపై వినతి ప‌త్రం స‌మ‌ర్పించారు. భవన నిర్మాణం కోసం బయట రాష్ట్రాల నుంచి “సి” ఫారంపై కొనుగొలు చేసే వస్తువులపై ఎంట్రి టాక్సు విధించడం వల్ల నిర్మాణ సంస్థ‌ల‌పై అనవసరపు పన్నుభారం పడుతోంది. వాణిజ్యశాఖ జారీ చేస్తున్న నోటీసుల వల్ల స్ధిరాస్తి వ్యాపారులు ఆందోళనకు గురౌతున్నారు. భవన నిర్మాణంచేసి వాటిని వినియోగదారులకు అమ్మకం చేస్తునామని, దీనిపై వ్యాట్ కూడ ఫ్రభుత్వానికి చెల్లిస్తాం కాబ‌ట్టి, ఎంట్రీ ట్యాక్సు విధించడం సమంజ‌సం కాద‌న్నారు. కాబట్టి ఎంట్రీ ట్యాక్సును తొల‌గించాల‌ని కోరారు. దీనిపై సానుకులంగా స్పందించిన సోమేష్ కుమార్.. డెవ‌ల‌ప‌ర్ల‌కు ప్రభుత్వం సాధ్యమైనంత వ‌ర‌కూ సాయం చేస్తుంద‌న్నారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రమైన సమాచారంతో ముఖ్యమంత్రి దృష్ఠికి తీసుకు వెళ్ళి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్ రెడ్డి, మరియు జె .ట్.విద్యాసాగర్, యం .సుబ్బయ్య , యం ప్రేంకుమార్ బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

'ఇంటిలిజెంట్‌' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరి 9 విడుదల
దుర్ముహూర్తం ఉదయం 09.06 ని.షా నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *