70ఏళ్ల చరిత్ర నేర్పింది ఇదేనా?

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. నేడు సీఎల్పీలో విలఖరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ తీరుపై ఎక్కుపెట్టి విమర్శలు చేశారు. శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మైక్ విసిరేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కంటికి బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో స్వామిగౌడ్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచనల మేరకు మెహిదీపట్నం సమీపంలోని సరోజినిదేవి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ మేరకు స్పందించి కాంగ్రెస్ చేష్టల్నిహరీష్ రావు వారి తీవ్రంగా ఖండించారు.

మీరు నేతలా లేక గుండాలా అంటూ ప్రశ్నించారు హరీష్.  70ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెసోళ్లారా మీకు 70ఏళ్ల చరిత్ర నేర్పిన అనుభవం ఇదేనా అంటూ చురకలంటించారు. అసలు ఆ ఎమ్మెల్యే( కోమటి రెడ్డి) మైకును గిరగిరా తిప్పి బలంగా విసిరేసిన తీరు చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయాన్ని జానారెడ్డి గారు ఎలా సమర్ధిస్తారంటూ ప్రశ్నించారు. జానారెడ్డి గారు సీనియర్ లీడర్, అతనంటే మాకు చాలా గౌరవం ఉందని అయితే ఈ తరహా చేష్టల్ని ఆయన ఎలా సమర్ధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ చేసిన ఆ తీరు తెలంగాణ ప్రజల్నే అవమనించిందంటూ మండిపడ్డారు. శాసనసభ అనేది దేవుడి గుడితో సమానం అన్న ఆయన అంత మహాత్తర ప్రదేశంలో కాంగ్రెస్ చూపిన విధానం అత్యంత సిగ్గుచేటుగా పరిగణించారు. కాంగ్రెస్ కు అపార అనుభవం ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు శాసనసభలో ఎలా బిహేవియర్ చేయాలో తెలియదా అంటూ హరీష్ ప్రశ్నల విర్షం కురిపించారు.

నిజానికి కాంగ్రెస్ నేతలు మైకు విసిరింది గవర్నర్ నరసింహన్ పై అని చెప్పారు. అయితే అది మిస్ అయి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలిందని పేర్కొన్నారు. దేశ రాజ్యంగంలో గవర్నర్ పాత్ర కీలకమైందని చెప్పిన హరీష్ రావు గవర్నర్ పై మైకులు విసురుతారా అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేసిన ఆ పని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పిన హరీష్ ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని, దీనిపై న్యాయపరమైన చర్యలు అమలయ్యేలా అధికారపక్షం ముందుకు వెళ్తుందన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ను శాఖల వారీగా పంచే ఈ శాసనసభలో కాంగ్రెస్ తీరు నీచమాలిన పనిగా అభివర్ణించారు మంత్రి హరీష్. ఈ విషయాన్ని వదిలిపెట్టే సమస్యే లేదంటూ తెగేసి చెప్పారు.

సిగ్గు సిగ్గు..!
ఉద్యమ సమయంలో మీరు గొడవలు చేయలేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *