రూ.10 నాణెం చెల్ల‌కుంటే 14440 ఫోన్ చేయండి

రాష్ట్రంలో ప‌ది రూపాయ‌ల నాణెంతో ఓ గొడ‌వ వ‌చ్చింది.  పేరుకు జేబులో ప‌ది రూపాయాలు ఉన్న‌ట్లే కానీ అవి ఎక్క‌డ చెల్లుతాయో.. ఎక్క‌డ చెల్ల‌వో తెలియ‌క ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఆటో వాలాలు, చిల్లర దుకాణ‌దారులు అయితే రూ.10 నాణెం చూసి భ‌య‌ప‌డిపోతున్నారు. కొన్ని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ బ్యాంకులు కూడా  తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తున్నారు. గ‌తంలో హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని ఓ బ్యాంకు మేనేజ‌రే  ఈ నాణేలు తీసుకోమ‌ని వినియోగ‌దారుడికి ఓ కాగితం రాసిచ్చాడు. 
ప‌ది రూపాయాల నాణెంపై ఉన్న‌గొడ‌వ‌ను ఓ కొలిక్కి తెచ్చేందుకు నేరుగా ఆర్‌బీఐ రంగ‌ప్ర‌వేశం చేసింది. గ‌తంలో రెండు సార్లు రూ.10 నాణెం చెల్లుంది అని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చినా ప్ర‌జ‌ల ధోర‌ణి మార‌క‌పోవ‌డంతో నేరుగా రంగ ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది.  దేశంలోని ప్ర‌తి వినియోగ‌దారుడి సెల్ నంబ‌రుకు సంక్షిప్త సందేశాలు పంపుతూ పంపుతూ అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది.  ప‌ది రూపాయాల నాణెలు పూర్తిగా చెల్లుతాయి. వాటి మార‌కం విలువ‌లో ఎలాంటి తేడా లేదు. సందేహాలు వ‌ద్దు అని సందేశాలు పంపుతోంది. ఎవ‌రైనా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తే మాకు చెప్పండి. 14440 టోల్ ఫ్రీ నంబ‌రుకు మిస్‌డ్ కాల్ చేసి ఫిర్యాదు చేయండి… అని పేర్కొంది. ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేసిన నాణేలాపై ప‌ది గీత‌లు, 15 గీత‌లు ఉన్నాయి. వాటిని మాత్ర‌మే ఆర్‌బీఐ తీసుకోవాల‌ని చెప్పుతోంది. అక్క‌డ‌క్క‌డ న‌కిలీ నాణేలు కూడా వ‌స్తున్న‌ట్లు తెలిసింది. అందుకే చాలా ప్రాంతాల్లో వాటిని తీసుకునేందుకు బ‌య‌ప‌డుతున్నారు. న‌కిలీ నాణేల పుకార్లు మాత్ర‌మే  న‌కిలీలు గుర్తిస్తే ఆర్‌బీఐకి తెల‌పండి అంటున్నారు.. ఆర్బీఐ అధికారులు.
అయితే ఆర్‌బీఐ అధికారుల‌కు ఇక్క‌డ అర్థం కాని విష‌యం ఒక‌టి ఉంది. సాధార‌ణ ప్ర‌జ‌లు నాణేలు తీసుకోవ‌డం లేదంటే.. న‌కిలీ బిల్ల‌లు వ‌స్తున్నాయ‌ని అనుకోవ‌చ్చు. మ‌రి బ్యాంకు అధికారులు కూడా ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంది. గ‌తంలో బ్యాంకు అధికారులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌ది నాణేలు ర‌వాణా చేసేందుకు బ్యాంకు అధికారుల‌కు ఇబ్బంది అవుతోంద‌ట‌. ఇప్ప‌టికే ఆయా బ్యాంకుల‌కు పెద్ద సంఖ్యంలో  నాణేలు రావ‌డంతో అవి ఎక్క‌డ నిల్వ చేసుకోవాలో తెలియ‌క‌, వాటిని ఎక్క‌డ భ‌ద్ర‌ప‌ర్చాలో తెలియ‌క అధికారులు వాటిని తీసుకోవ‌డం లేదు. అందుకు ఆర్‌బీఐ అధికారులు బ్యాంకు అధికారుల‌కు ఈ విష‌యంలో స్ప‌ష్ట‌మైనఆదేశాలు జారీ చేయాలి. బ్యాంకుల్లో తీసుకుంటే.. ఏ వ్యాపారి, ఆటోవాలా అయినా తీసుకుంటారు.. క్ర‌మంగా ప్ర‌జ‌లూ వాడేందుకు ఆస‌క్తి చూపుతారు.
సెల్ఫీ స్టైల్ మార్చు గురూ!
కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కుంటున్న బ్యాంకొళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *