కేసీఆర్‌కు ఇదే చివ‌రి అసెంబ్లీ స‌మావేశం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ఇదే చివ‌రి అసెంబ్లీ స‌మావేశ‌మ‌ని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉభయ సభల్లో కాంగ్రెస్‌ సభ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జాగ్ర‌హానికి గురి అవుతుంద‌ని జోస్యం ప‌లికారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహించారు. తెలంగాణ‌లో గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి ఐదు వేల మంది రైత‌న్న‌లు బ‌ల‌వన్మ‌ర‌ణం పొందారు. పంటలకు గిట్టుబాట ధరలు లేనే లేవు. రైతులు ఇంత గోస ప‌డుతుంటే.. గవర్నర్‌ ప్రసంగంలో క‌నీసం ఆ మాట ఉన్న‌దా? అంటూ ప్ర‌శ్నించారు. సమస్యలపై ఆందోళనకు దిగితే త‌మ స‌భ్యుల‌పై వేటు వేస్తారా అంటూ దుయ్య‌బ‌ట్టారు. అయినా, నిరసన తెలిపే హక్కును కాద‌న‌డానికి మీరెవ‌రంటూ మండిప‌డ్డారు. గతంలో తెరాస పార్టీ గవర్నర్‌పై దాడి చెసిన సంగతి మ‌ర్చిపోయారా? పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన చేసే సంగ‌తి మ‌ర్చిపోయారా? అంటూ రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి జరగలేదని, కేవ‌లం సీఎం డైరెక్ష‌న్‌లోనే వార్తలు ప్రసారం చేశారని ఆయ‌న మండిపడ్డారు. ‘‘స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలింద‌ని చెబుతున్నారు. కానీ, వీడియోను చూపెట్ట‌డం లేదు. అఖిలపక్షాన్ని పిలిచి వీడియోల‌ను చూపిస్తే నిజం బయటపడుతుంద‌న్నారు. హరీశ్‌రావు కనుసైగతో లోపలికొచ్చిన మార్షల్స్‌.. కాంగ్రెస్‌ సభ్యులను కొట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదంతా బీసీలను కాంగ్రెస్‌కు వ్యతిరేకం చేయాలన్న కేసీఆర్‌ పన్నాగంలో భాగ‌మ‌న్నారు. నల్లగొండలో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నందుకే కోమటిరెడ్డిపై కక్ష పెంచుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం ఆదేశాల మేరకే ఆస్పత్రిలో చేరానని స్వామిగౌడే స్వయంగా చెప్పడం ఈ హై కీల‌కాంశంగా రేవంత్ తెలిపారు.

పూజ ప్రేమ‌లో ప్ర‌భాస్‌...
కవితకు తెలుగులో మోడీ విషెష్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *