పూజ ప్రేమ‌లో ప్ర‌భాస్‌…

బాహుబ‌లి’ సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజీ స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. అయితే ఆయ‌న త‌ర్వాతి సినిమాలు ఏంటా? అనే చ‌ర్చ‌ల‌తో పాటు, మ‌నోడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడ‌బ్బా… అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఆయ‌న తాజాగా డీజే భామ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త‌న అందాల‌తో ప్ర‌భాస్‌ను మాయ‌లో ప‌డేసింద‌ట పూజా హెగ్డే. త్వ‌రలో వీరిద్ద‌రూ క‌లిసి ప్రేమ గీతాలు పాడుకునేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదులెండీ… రీల్ లైఫ్‌లోనే.
బాహుబ‌లి సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు కేటాయించిన ప్ర‌భాస్‌, ప్ర‌స్తుతం ర‌న్ రాజా ర‌న్ ద‌ర్శ‌కుడు సుజిత్ తో క‌లిసి ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. చిన్న ప్రాజెక్టుగా మొద‌లైన ఈ చిత్రం, బ‌డ్జెట్ పెంచుకుని భారీగా తయారైంది. దాదాపు 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ‘సాహో’ రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. క్లైమాక్స్ ఫైట్స్ కోస‌మే 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు స‌మాచారం. అదీ కాక యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం దుబాయ్ వెళ్లేందుకు స‌న్నాహాలు చేసుకుంటోంది సాహో చిత్ర టీం. అయితే దుబాయ్ ప్ర‌భుత్వం నుంచి షూటింగ్‌కి ప‌ర్మిష‌న్లు వ‌చ్చేందుకు ఆల‌స్యం అవుతుండ‌డంతో మిగిలిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ చిత్రం త‌ర్వాత ఓ తెలుగు సినిమా, ఓ బాలీవుడ్ సినిమా క‌మిట్ అయ్యాడు ప్ర‌భాస్‌.
తెలుగులో గోపిచంద్‌, రాశిఖ‌న్నా హీరోహీరోయిన్లుగా ‘జిల్‌’ సినిమాను తెర‌కెక్కించిన రాధాకృష్ణ ద‌ర్శ‌కత్వంలో ఓ ప్రేమ‌క‌థా చిత్రం చేయ‌బోతున్నాడు. భారీ యాక్ష‌న్ చిత్రాల త‌ర్వాత ప్రేమ‌క‌థ చేయ‌డం ప్ర‌భాస్‌కి అల‌వాటు. ‘బిల్లా’, ‘ఏక్ నిరంజ‌న్‌’ వంటి మాస్ సినిమాల త‌ర్వాత ‘డార్లింగ్‌’, ‘మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌’ వంటి క్లాస్ చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్మూలాను ఫాలో అవ్వాల‌ని చూస్తున్నాడు. ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో హీరోయిన్‌గా డీజే భామ పూజా హెగ్డేను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ యువీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొంద‌బోతోంది. చిత్రీక‌ర‌ణ‌ను ఈ ఏడాది మ‌లి సగంలో ప్రారంభించ‌నున్నారు. జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ల‌నున్నారు. ప్ర‌భాస్ అటు సాహో షూటింగ్‌లో పాల్గొంటూనే, ఈ సినిమాలో న‌టిస్తాడు.
హృతిక్‌తో చేసిన బాలీవుడ్ సినిమా ప‌రాజ‌యం త‌ర్వాత తెలుగులో అల్లుఅర్జున్ డీజే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టింది పూజా హెగ్డే. రూటు మార్చి, య‌మ హాటుగా క‌న్పిస్తోంది. సాధ్య‌మైనంత త‌క్కువ దుస్తుల్లో సెక్సీగా క‌న్పించేందుకే ఆరాట‌ప‌డుతోంది. ఆ అమ్మ‌డి ఆరాటం వ‌రుస అవ‌కాశాలు తెస్తోంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌సన ‘సాక్ష్యం’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజా. ఈ సినిమా కోసం కోటిన్న‌ర పారితోషికం తీసుకుంద‌ని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్‌తో ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతంలో చిందేస్తోంది. ఒక్క పాట‌కే 50 ల‌క్ష‌లు అందుకుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లో ఎన్‌టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సినిమాలోనూ, మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి సినిమాలోనూ హీరోయిన్‌గా సెల‌క్ట‌య్యింది. ఇప్పుడు ప్ర‌భాస్ కూడా పూజా వెంటే ప‌డుతుండ‌డం ఆమె డిమాండ్ ఎంత పెరిగిపోయిందో తెలుపుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంచ‌లన‌ నిర్ణ‌యం
కేసీఆర్‌కు ఇదే చివ‌రి అసెంబ్లీ స‌మావేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *