సిగ్గు సిగ్గు..!

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై అసంతృప్తి ఇలా వ్య‌క్తం చేస్తారా?
శాస‌న‌మండ‌లి స‌భాప‌తిపై ఉభ‌య స‌భ‌ల సాక్షిగా ప్ర‌తిప‌క్షాలుచేసిన దాడి సిగ్గుమాలిన ప‌ని అని అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. కానీ దాడికి చేసిన నేత మాత్రం దాన్ని స‌మ‌ర్థించుకున్న తీరును ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.  ఇది ఒక వ్య‌క్తికి జ‌రిగిందంటే ఇంత చర్చ అన‌వ‌స‌రం. కానీ వ్య‌వ‌స్థపై చేసిన దాడిగా ప‌రిగ‌ణించాలి. కానీ కోమ‌టి రెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఘ‌ట‌న దారుణ‌మే.
గ‌వ‌ర్న‌ర్ రాజ్యాంగ ప్ర‌తినిధి త‌న ప్ర‌సంగం పూర్త‌యి జ‌న‌గ‌ణ‌మ‌న పాడే క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో  తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు. ఉన్న 12మంది కాంగ్రెస్ స‌భ్యులు పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని చూశారు. కానీ అక్క‌డ గ‌వ‌ర్న‌ర్ ఉండ‌టంతో పెద్దెత్తున మార్ష‌ల్స్ మోహ‌రించారు. కోమ‌టిరెడ్డి మార్ష‌ల్స్ మీదుగా హియ‌ర్ఫోన్లు విసిరాడు మొద‌టి సారి తాక‌క‌పోవ‌డంతో..  రెండో సారి మ‌రీ బెంచి ఎక్కి మ‌రీ మ‌ళ్లీ విసిరాడు. ఈ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమైంది. ప్ర‌జ‌లు, కింది స్థాయి స‌భ‌ల్లోనూ త‌ర‌హా భాహాబాహీకి దిగాల‌ని ఓ సందేశం ఇస్తున్న‌ట్లు ఉంటుంద‌న్న క‌నీసం విచ‌క్ష‌ణ మ‌రిచారు… నేత‌లు.  పార్లెంటులో డ‌బ్బులు ప్ర‌ద‌ర్శించిన నేత‌లు, ఉద్య‌మ స‌మ‌యంలో హ‌రీష్ గ‌వ‌ర్న‌ర్‌పై దాడికి య‌త్నం చేశార‌న్న ఆరోప‌ణ‌లు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎంతో మ‌చ్చ తెచ్చాయి. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూడా చంద్ర‌బాబును ఉద్దేశించి.. నీయ‌మ్మ అనే ప‌దం వాడ‌ట‌మూ చాలా వివాద‌స్ప‌ద‌మైంది. నేడు దాడుల వ‌ర‌కు వెళ్లిందంటే స‌మాజం ఏం నేర్చుకోవాల‌ని అనుకుంటున్నారు ఈ నేత‌లు. శాస‌న మండ‌లిలో గ‌తంలో ఇలాంటి దారుణ‌మే జ‌రిగితే ఓ ప్ర‌ముఖ ప‌త్రిక -పెద్ద‌ల గ‌లాబా- అని క‌థ‌నం ఇస్తే.. ఆ పెద్ద‌లంతా చాలా పీల‌య్యారు. శాస‌న మండ‌లిని అంత‌లా విమ‌ర్శిస్తారా అని తీవ్రంగా ఆ మీడియాను ఆక్షేపించారు. మ‌రి వారు చేస్తున్న‌దేంటో ఆలోచించుకోవాలి.
కోమ‌టి రెడ్డి త‌న ఉనికి కోసం చేస్తున్న ప‌నే ఈ దాడిగా అనుకోవాలి. గ‌తంలో రైతులకు విద్యుత్తు ఇవ్వాల‌ని చేసిన ధ‌ర్నా, ఇటీవ‌ల బ‌స్సు యాత్ర అన్నింటికి మీడియా కాంగ్రెస్ నేత‌లు అనుకున్న‌ట్లు ప్ర‌చారం చేయ‌లేదు. దీంతో ఇలానైనా చేస్తే వ‌స్తుంద‌ని చేసిన ఘ‌ట‌న‌గానే భావిస్తున్నారు ప్ర‌జ‌లు. కాంగ్రెస్ నేత‌లు అంటున్న‌ట్లు ఇది కావాల‌ని జ‌ర‌గ‌లేదు అంటున్నారు.. కానీ కెమెరాల ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తే.. కోమ‌టి రెడ్డి తోటి నాయ‌కుల‌తో న‌వ్వుతూ మాట్లాడుతూ రెండు సార్లు మైక్ విసిరిన‌ట్లు క‌నిపిస్తోంది. అంటే పోడియం మీదున్న గ‌వ‌ర్న‌రో, మిగ‌తా వారినో కేంద్రంగా దాడి చేసిన‌ట్లుక‌నిపిస్తుంది. గ‌వ‌ర్న‌ర్‌ను హ‌రీష్‌రావు, ఈట‌ల డ్రైవ‌ర్ జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ పై చేసిన దాడుల‌ను కాంగ్రెస్ నేత‌లు ఊతంగా చూపుతున్నారు.. అంటే అనాడు అదీ త‌ప్పే.. వారు చేశార‌ని నేడు మేమూ చేస్తాం అని బుకాయిస్తే.. వ్య‌వ‌స్థ‌ను ఎటు తీసుకెళ్లాల‌నుకుంటున్నారు.
మ‌హా రైతుల ప‌ట్టు.. రాత‌పూర్వ‌క హామీతో దిగొచ్చిన ప్ర‌భుత్వం
70ఏళ్ల చరిత్ర నేర్పింది ఇదేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *