శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణాలు తెలియాలి!

ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయనీ భారత్ లో మాదిరిగా కాసులకు పలుకుబడికీ తలవంచవనీ నిన్నటి దాకా ఒకరకమైన నమ్మకం ఉండేది. శ్రీదేవి అనుమానాస్పద మృతి కేసులో దుబాయ్ చట్టాలు వేసిన పిల్లిమొగ్గల్ని చూస్తే.. అదంతా గుడ్డి నమ్మకమేనని తేలిపోయింది. మొదట గుండెపోటు అన్నారు. ఆపై ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయిందన్నారు. నీళ్ళతొట్టెలోకి ఆమె ఎలా పడింది? ఆమె రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్ళెలా వచ్చాయి? పడిపోయినప్పుడు తొట్టె బలమైన అంచులు తగిలి గాయం కాకుండా ఉంటుందా? శవపరీక్ష నివేదికలో ‘ప్రమాదవశాత్తూ’అనేమాట ఎలా వాడారు? అటాప్సీ చేసినవారికి అది ప్రమాదమో లేదా వేరొకరి ప్రయత్నమో ఎలా తెలుస్తుంది? అలాంటి నిర్ధారణకు ఎలా వచ్చారు? ఆ కోణం తేల్చాల్సింది పోలీసు విచారణలో కదా? నీళ్ళలో బలవంతంగా ముంచేసినా ప్రాణం పోతుందికదా! అంతపెద్ద హోటల్లో సీసీ ఫుటేజ్ దొరకలేదా? విచారణకది కీలకం కాదా? ఫోన్ కాల్స్ డేటా ఏమైంది? ఇవన్నీ యుఏఈ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం అడగాలి కదా! ఎందుకు అడగలేదు? ఆమెను అభిమానించే లక్షల మందికి నిజం తెలుసుకునే హక్కులేదా? పరాయిగడ్డపై అర్థాంతరంగా తనువు చాలించాల్సిన అగత్యం ఆమెకెందుకు ఏర్పడింది? వీటికి సమాధానాలు ఎప్పటికీ రావు!

‘ఆఫీసర్‌’గా మారిన నాగార్జున‌
మోడీని మ‌రోసారి చుల‌క‌న చేసిన ట్రంప్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *