ప్ర‌భాస్‌, మ‌హేష్ కంటే ముందున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ… ‘పెళ్లిచూపులు’ సినిమాకి ముందు ఈ పేరు ఎవ‌రికీ తెలీదు, ఆ త‌ర్వాత రెండేళ్ల‌కి వ‌చ్చిన ‘అర్జున్‌రెడ్డి’ త‌ర్వాత ఇత‌ని పేరు తెలియ‌ని తెలుగువారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. వివాదాల‌తో, ప్ర‌చార చిత్రాల‌తో, న‌ట‌న‌తో అంత‌లా జ‌నాల నోళ్ల‌లో నానింది విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు. ఒకే ఒక్క సినిమా అత‌న్ని సెన్సెష‌న‌ల్‌ స్టార్‌గా మార్చేసింది. ఆ సినిమా, విజ‌య్‌కి ఎంత‌టి క్రేజ్ తెచ్చిందంటే, ‘బాహుబ‌లి’ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కూడా విజ‌య్ దెబ్బ‌కి రేసులో వెన‌క‌బ‌డ్డారు. 
ఇంత‌కీ ఎందులో అనుకుంటున్నారు. హైద‌రాబాద్ టైమ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌తి ఏటా ‘మోస్ట్ డిజ‌ర‌బుల్ మెన్‌’ పేరిట భాగ్య‌న‌గ‌రంలో ఎక్కువ మంది మెచ్చిన‌, కోరిన‌, పాపుల‌ర్ అయిన వ్య‌క్తుల లిస్టును ప్ర‌కటిస్తుంది. అందులో ప్ర‌భాస్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌ను వెన‌క్కినెట్టి రెండో స్థానంలో నిలిచాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మొద‌టి స్థానం ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్, మోడ‌ల్‌, ఎమ్ టీవీ యాంక‌ర్ బ‌షీర్ అలీ నిలిచాడు. మూడో స్థానంలో ప్ర‌భాస్, నాలుగో స్థానంలో మ‌హేష్‌బాబు నిలిచారు. ప్ర‌భాస్ ‘బాహుబ‌లి’ క్రేజ్ కార‌ణంగా ఆరో స్థానం నుంచి ఎగ‌బాకి మూడో ప్లేస్ ద‌క్కించుకుంటే, ‘స్పైడ‌ర్‌’ సినిమా ప‌రాజ‌యం కార‌ణంగా మ‌హేష్‌బాబు రెండోస్థానం నుంచి నాలుగో ప్లేస్‌కి ప‌డిపోయాడు.
ఐదో స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఆరో స్థానంలో అత‌ని బావ అల్లుఅర్జున్ నిలిచారు. వీరిద్ద‌రూ త‌న స్థానాల‌ను మెరుగు ప‌రుచుకుని పైకి ఎగ‌బాక‌డం విశేషం. ఏడో స్థానంలో బ‌ల్లాల‌దేవుడు రానా ద‌గ్గుపాటి నిలిచాడు. గ‌త ఏడాది నాలుగో స్థానంలో ఉన్న రానా, ఈ ఏడాది మూడు స్థానాలు కోల్పోయాడు. ఎనిమిదో స్థానంలో హైద‌ర‌బాదీ మోడ‌ల్‌, టీవీ న‌టుడు రోహిట్ కాందేల్‌వాల్ నిలిచాడు. గ‌త ఏడాది ఇత‌ను మొద‌టి స్థానంలో ఉండ‌డం విశేషం. తొమ్మిదో స్థానంలో యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ నిలిచాడు. తార‌క్ గ‌త ఏడాది ఐదో స్థానంలో ఉండేవాడు. గ‌త ఏడాది మూడో ప్లేస్‌లో ఉన్న న్యాచుర‌ల్ స్టార్ నాని, ఈ సారి ఏకంగా ప‌దో స్థానానికి ప‌డిపోయాడు. ప‌ద‌కొండులో హీరో రామ్‌, ప‌న్నెండులో నాగ‌చైత‌న్య , ప‌ద‌మూడోలో అఖిల్ ఉన్నారు. ‘బిగ్ బాస్‌’ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేసిన ప్రిన్స్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, న‌వ‌దీప్‌ల‌కు ఈ సారి లిస్టులో స్థానం ద‌క్క‌డం విశేషం.
కేసీఆర్ ని కలిసిన హైదరాబాద్ కొత్త సిపి
చారిత్రాత్మక నిర్ణయం...జగన్ రాజీనామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *