సిరియా మార‌ణ‌హోమానికి కార‌ణ‌మెవ‌రు?

ప్ర‌పంచ దేశాలు స్పందించండి.. సిరియాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంది.. అని మేధావులు అంటున్నారు. ఇంత‌కి ఈ మార‌ణ‌హోమానికి కార‌ణం అక్క‌డి ప్ర‌భుత్వం అని ప్ర‌జాస్వామ్య దేశాలు అంటున్నాయి. అక్క‌డి ప్ర‌భుత్వానికి సాయం చేస్తున్న ర‌ష్యా అంటున్నాయి. ఇందులో నిజం ఎంత‌..?
సిరియా పాపం మొత్తం అమెరికాదే.  అఫ్ఘ‌నిస్తాన్‌లో వ‌సామాబిల‌న్ లాడెన్‌ను పెంచి పోసించిన‌ట్లు, ఇరాక్‌లో స‌ద్దాం హుస్సేన్‌ను  చంపేందుకు కుంటి సాకుతో ఆ దేశాన్ని చిన్నాభిన్నం చేసిన‌ట్లు ఇప్పుడు త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారిన సిరియాపైన అమెరికా త‌న యుద్ధ కాంక్ష‌ను అమ‌లు చేస్తోంది. అందుకే ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌కుండా లాడెన్‌ను ప్రోత్స‌హించి యుద్ద సామ‌గ్రి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లుగానే అక్క‌డ ఉన్న ఉగ్ర‌వాదుల‌కు సాయం చేస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఐఎస్ ఐఎస్ తోపాటు సౌదీ, ట‌ర్కీ, లెబ‌నాన్ సాయంతో న‌డిచే ఉగ్ర‌వాద సంస్థ‌లు న‌డుస్తున్నాయి. వీటి అమెరికా ఆయుధ సంప‌త్తిన స‌మ‌కూరుస్తోంది. 
విధ్వంసానికి కార‌ణం..
సిరియా రాజ‌రిక పాల‌న ఐనా త‌న వ‌న‌రుల‌తో స్వ‌యం స‌మృద్ధి సాధించేందుకు చూస్తున్న దేశం. మొద‌టి నుంచి ఇత‌ర ప్రాంత వారి పాల‌న‌లోనే అక్క‌డి ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. సౌదీ దేశాల్లో చాలా దేశాల్లో రాజ‌రిక పాల‌న ఉంది. సౌదీ అరేబియాలో క‌నీసం మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు కూడా లేదు. చాలా నిర్బంధం కానీ అమెరికా అక్క‌డ ప్ర‌జాస్వామ్యాన్ని తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించ‌లేదు. ఒక్క సిరియాలోనే ప్ర‌జాస్వామ్యం ఎందుకు పున‌రిద్ధ‌రించాల‌ని అనుకుంటోంది..? దీనికికార‌ణం ఉంది.. సిరియాలో అమెరికా మాట విన‌డం లేదు. అక్క‌డ చ‌మురు నిక్షేపాలు చాలా ఉన్నాయి. ఆ ఒక్క‌దేశం చేజిక్కితే అమెరికాకు చ‌మురు కొర‌త రాదు. ఇంకా సౌదీ దేశాల నుంచి అమెరికాకు వ‌చ్చే చ‌మురుకు సంబంధించిన పైపు లైన్లు సిరియా నుంచే రావాలి. అందుకే అమెరికా అక్క‌డ త‌న ప్రాభ‌ల్యం నెల‌కొల్పాల‌ని త‌ను ప్ర‌త్య‌క్షంగా ఏమీ చేయ‌లేక ఉగ్ర‌వాదుల‌ను ప్రోత్స‌హిస్తోంది.  క్ర‌మంలో ఆయుధ సంప‌త్తిని బాగా సంపాదించుకున్న ఉగ్ర‌వాద దేశాలు.. సౌది, లెబ‌నాన్, ట‌ర్కీ ఆర్థిక సాయంతో  ప్ర‌భుత్వం యుద్దం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అమెరికా, ర‌ష్యా ప్ర‌చ్చ‌న్న యుద్ధం చేస్తున్నంత ప‌ని చేస్తున్నాయి. కానీ అక్కడి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పైన ర‌సాయ‌న ఆయుధాలు ప్ర‌యోగింస్తుంద‌న‌డంలో ప్ర‌జాస్వామ్య దేశాలను న‌మ్మించేందుకు అమెరికా చేస్తున్న ప్ర‌చారం, మోసం మాత్ర‌మే.  త‌న భ‌విష్య‌త్తు చ‌మురు నిల్వ‌ల కోసం అక్క‌డో కీలు బొమ్మ‌లాంటి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకోవాల‌ని సామ్రాజ్య వాద కాంక్ష‌తో మ‌రో దేశాన్ని బ‌లి చేస్తోంది.
మ‌రి సామాజిక మాధ్య‌మాల్లో ఎందుకు ఈ ప్ర‌చారం.. ఇంట‌ర్‌నెట్‌, సామాజిక మాధ్య‌మాలు అన్నీఅమెరికా చ‌ల‌వే.. అందుకే ఇలాంటి అమెరికా కుట్ర‌ను వారికి ల‌బ్ధి చేకూరేలా ప్ర‌చారం చేసుకుంటున్నాయి. ఇరాక్ మాన‌వ వినాశ‌క‌ర ఆయుధాలు ఉన్నాయిని యుద్ధం చేసి స‌ద్దాం హుస్సేన్‌ను హ‌తం చేసిన అమెరికా ఆ త‌ర్వాత కూడా ఆయుధాలున్నట్లు చూప‌లేక‌పోయింది. ఇక్క‌డ కూడా అంతే అక్క‌డ చిచ్చుపెట్టి అమెరికా చోద్యం చూస్తోంది.
నన్ను దారుణంగా అత్యాచారం చేశాడు...
జ‌గ‌న్ వేసిన మెట్లు చంద్ర‌బాబుకు ఉప‌యోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *