వాట్సప్‌లో ‘డిలీట్‌’

ప్రతి ఒక్కరు ఇప్పుడు వాట్సప్ ను వినియోగిస్తున్నారు. ఇప్పుడు జియో అందుబాటులోకి రావడంతో  సాధారణమైన వ్యక్తికి సైతం స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. కానీ ఒక్కసారి పంపిన సందేశాన్ని అందులో డిలీట్ చేయలేము. ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో ప్రొఫెషనల్ గానో… పర్సనల్ గానో బిజీలో ఏదైనా తప్పడు సమాచారాన్ని పంపితే దానిని తర్వాత సందేశంతో సరిచేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు.. అలాంటి సమయంలో వాట్సప్ లో సరికొత్త టెక్నాలజీ  ఒకటి అమలులోకి వచ్చింది. అదే మనమెంతో ఎదురుచూస్తున్న వాట్సప్ డిలీట్ ఆప్షన్ వచ్చేసింది. కానీ అది మొదట 7 నిమిషాల వ్యవధిలోనే డిలీట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వ్యవధిని ఇప్పుడు 68 నిమిషాలకు పెంచారు. కానీ ఇది ప్రస్తుతం బీటా వర్షన్ లోనే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అన్ని మొబైల్స్ లో అందుబాటులోకి రానుంది. వాట్సప్‌లో అన్ని సందేశాల్నీ అందరికీ పంపించలేం! స్నేహితులకో ప్రియురాలికో పంపాల్సిన మెసేజ్‌ పొరపాటున కుటుంబసభ్యులకు పంపేస్తే తలకాయనొప్పే. అలా పొరపాటున ఒకరికి పెట్టబోయి మరొకరికి పెట్టిన మెసేజ్‌లను తొలగించడానికి వాట్సప్‌ ఇప్పటికే ఒక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానిప్రకారం.. మనం మెసేజ్‌ పెట్టిన ఏడు నిమిషాలలోపు డిలీట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏడు నిమిషాలు దాటితే మాత్రం ఆ అవకాశం లేదు. ఈ గడువును 68 నిమిషాలకు పెంచేందుకు వాట్సప్‌ సిద్ధమైంది. ప్రస్తుతం బీటావర్షన్‌లో ఈ అప్‌డేట్‌ను పరిశీలిస్తోంది. అంతా అనుకున్నట్టే జరిగితే త్వరలోనే ఈ ఆప్షన్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
వాట్సప్‌లో ‘డిలీట్‌’
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక మోడీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *