ఏమంత్రం వేసావె రివ్యూ…

అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా టాప్ గేర్ వేసిన నటుడు విజయ్ దేవరకొండ. నిజానికి ఈ హీరో మన పక్కింటబ్బాయి మాదిరిగానే ప్రవర్తిస్తాడు. ఆయన మాటలు, బిహేవియర్ అన్ని చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. సరే ఇప్పుడు ఆయన తాజా చిత్రం విశేషాలు చూద్దాం. విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఏ మంత్రం వేసావె. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో చూద్దాం!

కథ: ఇదో కంప్యూటర్ వీడియో గేమ్ కథ. అంటే హీరో, హీరోయిన్ లకు ఈ సినిమాలో వీడియో గేమ్లు అంటే పిచ్చి. అయితే కథ విషయానికి వస్తే..కథానాయకుడు నిఖిల్ (దేవరకొండ) వీడియో గేమ్ లు అంటే అదో ప్రపంచంలా పీల్ అవుతుంటాడు. పొద్దున లేచిన మొదలు కంప్యూటర్ పై గడిపేయడమే. అటు హీరోయిన్ రాగమాళిక సినిమాలో వీడియో గేమ్ డిజైనర్ పాత్రలో నటించింది. అయితే వీరిద్దరి కలయిక ఎలా అంటే రాగమాళిక విషయం తెలుసుకున్న నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. అయితే రాగమాళిక నిఖిల్ తో స్నేహం చేయడానికి ఓ బెట్ కడుతుంది. నేను ఎక్కడ ఉంటానో తెలుసుకోవాలని నిఖిల్ తో చెప్తుంది. ఈ మేరకు తన ప్రపంచం అయిన వీడియో గేమ్ ను పక్కనపెట్టి రాగమాళిక చిరునామాను కనిపెట్టే పనిలో నిమగ్నమౌతాడు. ఇది కథ. చివరగా నిఖిల్ రాగమాళికను ఎలా కలిశాడు? ఈ సందర్భంలో నిఖిల్ ఎదుర్కొన్న సమస్యలేంటో తెలియాలంటే మీరు థియేటర్ కు వెళ్లక తప్పదు.

బలాలు: విజయ్ దేవరకొండ, స్టోరీ

బలహీనతలు: సాగదీత, కొన్ని సన్నివేశాల్లో అవసరమా అనిపించే బోరింగ్ సీన్లు

రివ్యూ: గేమ్ ఆడే ప్రయత్నం చేశారు…

సంచలనం :2లక్షల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు...
రాత్రికి రాత్రే అరెస్ట్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *