ఏపీలోకి సీబీఐకి నో ఎంట్రీ | NO Entry For CBI To Andhra Pradesh

  • ఆంధ్రప్రదేశ్ సర్కారు సంచలన నిర్ణయం
  • బాబు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. అతడే ఆ పని చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. దానిని నివృత్తి చేసుకోవడానికి అతడి ఇంటికి వెళ్లి సోదా చేయాలనుకున్నారు. అయితే, అందుకు అతడు అంగీకరించలేదు. ఇది నా ఇల్లు.. నా అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను ఒప్పుకుంటేనే నా ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేయాలని చెప్పాడు. ఎందుకంటే తనిఖీలు జరిపితే దొంగతనం సంగతి బయటపడుతుందనేది అతడి భయం. సరిగ్గా ఈ కథ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి సరిపోతుంది. తమను అడక్కుండా, తమ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అడుగు పెట్టడం వీల్లేదంటూ ఓ జీవో జారీ చేశారు. ఢిల్లీ పోలీసు చట్టంలో ఉన్న ఓ నిబంధనను ఆసరాగా చేసుకుని ఈ జారీ చేయడం గమనార్హం.
ఇటీవల రాష్ట్రంలో ఐటీ, సీబీఐ సోదాలు గట్టిగా జరగడంతో విపరీతంగా భయపడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఏకంగా సీబీఐకే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అంటే, రాష్ట్రంలో ఏ కేసునైనా విచారించడానికి సీబీఐ అధికారులు రావాలంటే, ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నమాట. చివరకు కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు చేయడానికి కూడా సీబీఐ రావడానికి వీల్లేదు. చట్టంలో ఉన్న ఓ నిబంధనను ఆధారంగా చేసుకుని చంద్రబాబు ఇలా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నుంచి రక్షణ చట్రం ఏర్పాటు చేసుకున్నారన్న మాట. ఇప్పటికే ఈ నిర్ణయంపై అన్ని వైపులు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీబీఐ అంటే అంతగా భయపడాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ తప్పూ చేయనప్పుడు, ఎలాంటి అక్రమాలు లేనప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అంటే.. ఎక్కడో ఏదో జరుగుతన్నట్టే కదా.. అది ఎక్కడ బటయపడుతుందోనని భయపడుతున్నట్టే కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టడం వెనుక కారణాలు ఏమిటో, జనాలకు చంద్రబాబు ఏమి చెబుతారో వేచి చూడాల్సిందే.

For More Interesting Update Subscribe to My youtube channel TSNEWCHANNEL

Subscribe My Channel 

Chief minister say no entry for CBI, cm not allowing cbi to ap, cbi to ap, CBI to visit to andhra pradesh, AP Minister are in big trouble, AP minister are beware of cbiYOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *